International Yoga Day : యోగా నేర్చుకోవాలంటే.. mYoga app డౌన్‌లోడ్ చేసుకోండిలా..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయూష్ మంత్రిత్వ శాఖ కొత్త యోగా యాప్ లాంచ్ చేసింది.. అదే.. WHO mYoga యాప్. ఈ కొత్త mYoga యాప్ ద్వారా ఎవరైనా సరే ఈజీగా యోగా నేర్చేసుకోవచ్చు.

International Yoga Day : యోగా నేర్చుకోవాలంటే.. mYoga app డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Myoga App Launched On International Yoga Day

Updated On : June 21, 2021 / 3:00 PM IST

International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయూష్ మంత్రిత్వ శాఖ కొత్త యోగా యాప్ లాంచ్ చేసింది.. అదే.. WHO mYoga యాప్. ఈ కొత్త mYoga యాప్ ద్వారా ఎవరైనా సరే ఈజీగా యోగా నేర్చేసుకోవచ్చు. యోగా యాప్ లోని ఆడియో, వీడియో క్లిప్స్ ద్వారా యోగా నేర్చుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంస్థ సహకారంతో ఈ కొత్త యోగా యాప్ డెవలప్ చేశారు.

యోగా డే లైవ్ స్ట్రీమ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యోగా యాప్ అప్లికేషన్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ mYoga యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. iOS వెర్షన్ యోగా అప్లికేషన్ త్వరలో ప్రవేశపెట్టనుంది.

ఆయూష్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 12ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు వారు ఎవరైనా సరే ప్రతిరోజు యోగా నేర్చుకునేందుకు ఈ యాప్ ను వినియోగించుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతానికి mYoga యాప్ 10, 20, 45 నిమిషాల ఆడియో, వీడియో క్లిప్‌లతో, వివిధ ఆసనాలను నేర్చుకోవచ్చు.

mYoga app డౌన్‌లోడ్ చేసుకోండిలా..
– ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి.
– mYoga app యాప్ నేమ్ సెర్చ్ చేయండి.
– install ఆప్షన్ పై ట్యాప్ చేయండి.
– యాప్ ఓపెన్ చేసి.. యోగా ప్రాక్టిస్ చేసుకోండి..