Netflix Household Account : నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అకౌంట్ ఏంటి? ఇదేలా సెటప్ చేసుకోవాలి.. పాస్‌వర్డ్ షేరింగ్ ఇక వారికి మాత్రమే..!

Netflix Household Account : నెట్‌ఫ్లిక్స్ క్రమంగా అన్నిదేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులు తమ సొంత అకౌంట్లకు పేమెంట్ చేయకుండా పాస్‌వర్డ్ షేరింగ్‌ చేయడాన్ని నిలిపివేసింది.

Netflix Household Account : నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అకౌంట్ ఏంటి? ఇదేలా సెటప్ చేసుకోవాలి.. పాస్‌వర్డ్ షేరింగ్ ఇక వారికి మాత్రమే..!

Netflix Household Account _ How to setup your Netflix household account, step-by-step guide

Updated On : July 22, 2023 / 6:25 PM IST

Netflix Household Account : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొన్ని నెలలుగా పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠిన చర్యలను చేపడుతోంది. నెట్‌ఫ్లిక్స్ చందాదారులందరూ తమ సొంత అకౌంట్లకు పేమెంట్ చేయాల్సిందేనని కంపెనీ స్పష్టం చేసింది. పాస్‌వర్డ్ షేరింగ్ చేసే అకౌంట్లపై నెట్‌ఫ్లిక్స్ కన్నెర్ర చేసింది. అందులో భాగంగానే కెనడా, న్యూజిలాండ్, పోర్చుగల్, స్పెయిన్‌ వంటి దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ స్థానంలో కొత్త ప్రక్రియను ప్రారంభించింది.

ఇప్పుడు క్రమంగా ఇతర దేశాలకు ఈ కొత్త విధానాలను అమలు చేస్తోంది. ఇటీవల, నెట్‌ఫ్లిక్స్ భారత మార్కెట్లో (Netflix Household Account) అనే కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు వినియోగదారుల సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వినియోగదారులు తమ అకౌంట్లలో ప్రైమరీ లొకేషన్ తప్పక తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని వినియోగదారులు ఒకే అకౌంట్ ఉపయోగిస్తున్నారో లేదో నెట్‌ఫ్లిక్స్ తెలిసిపోతుంది. అందుకే, నెట్‌ఫ్లిక్స్ ‘యాక్సెస్ అండ్ డివైజెస్ మేనేజ్‌మెంట్’ పేజీని ప్రవేశపెట్టింది.

Read Also : Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ వ్యూహం ఫలించింది.. పాస్‌వర్డ్ షేరింగ్ ఆపేసింది.. కొత్తగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు..!

ఈ కొత్త విధానం ద్వారా నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులు తమ అకౌంట్ యాక్సెస్ ఉన్నవారిని చెక్ చేయడమే కాకుండా అనధికార యూజర్లను తొలగించడానికి కూడా అనుమతిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేసినట్టు అనుమానిస్తున్న ఖాతాదారులకు వరుస ఇమెయిల్‌లను పంపుతోంది. ఈ ఇమెయిల్‌లు ఖాతాదారులను వారి అకౌంట్లను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి అకౌంట్ సస్పెన్షన్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ సింగిల్ అకౌంట్ ఎక్కువ మంది గృహాలలో ఉపయోగించినట్టు గుర్తిస్తే వెంటనే ఆయా అకౌంట్ల యాక్సెస్‌ను బ్లాక్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒక ఇంటిలో కలిసి జీవించే వ్యక్తులకు మాత్రమే షేరింగ్ చేసుకోనే వీలు కల్పించింది. మీ ఇంట్లో లేని వ్యక్తులు నెట్‌ఫ్లిక్స్‌ని చూసేందుకు వారి సొంత అకౌంటుతో సైన్ అప్ చేయాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అకౌంట్ అంటే ఏమిటి? :
నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అనేది మీ ఇంటిలో నివసించే వ్యక్తులతో మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఫీచర్. మీ ఇంటిలోని ఎవరైనా అదే ఇంటర్నెట్ కనెక్షన్‌కి కనెక్ట్ చేసిన ఏదైనా డివైజ్‌లో Netflixని చూడవచ్చు. కొత్త ఫీచర్‌లో ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ యాక్సెస్, డివైజ్‌లను మేనేజ్ చేయడం వంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ అకౌంట్ ఎలా సెటప్ చేయాలి? :
నెట్‌ఫ్లిక్స్ (Netflix) హౌస్‌హోల్డ్‌ని క్రియేట్ చేసేందుకు అకౌంట్ సెటప్ చేయాలి. తద్వారా మీ హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్‌కి లింక్ అవుతుంది. మీరు ఈ దశలను ఫాలో చేయడం ద్వారా పూర్తి చేయవచ్చు. మీ నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని ఇలా అప్‌డేట్ చేసుకోవాలి.

Netflix Household Account _ How to setup your Netflix household account, step-by-step guide

Netflix Household Account _ How to setup your Netflix household account, step-by-step guide

1. మీ టీవీలో నెట్‌ఫ్లిక్స్ హోమ్ స్క్రీన్‌కి వెళ్లి Menu ఓపెన్ చేయండి.
2. ‘Get Help‘ ఆప్షన్ ఎంచుకుని, ఆపై ‘Manage Netflix Household’ ఆప్షన్ క్లిక్ చేయండి.
3. మీ నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ను నిర్వహించాలనుకుంటున్నారా లేదా దానిని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా అని నిర్ధారించండి.
4. ఇమెయిల్ పంపడానికి లేదా టెక్స్ట్ మెసేజ్ పంపడానికి ఆప్షన్ ఎంచుకోండి. కొద్దిసేపటి తర్వాత, మీ ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్‌లో వెరిఫికేషన్ లింక్‌ని అందుకుంటారు. దయచేసి 15 నిమిషాల తర్వాత లింక్ వ్యాలిడిటీ ముగుస్తుందని గుర్తుంచుకోండి.
5. మీకు ఇమెయిల్ వస్తే.. వెంటనే నిర్ధారించడానికి ‘Yes, This Was Me’ పై క్లిక్ చేయండి. మీకు టెక్స్ట్ మెసేజ్ వచ్చినట్లయితే అందించిన లింక్‌పై నొక్కండి.
6. ఇప్పుడు, మీ నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని Confirm చేయడం లేదా దానిని Update చేయడంతో కొనసాగండి.
7. ఆ తర్వాత, మీ టీవీ స్క్రీన్‌పై Confirm మెసేజ్ చూడవచ్చు. ఆపై Confirm చేసుకోవాలంటూ ఇమెయిల్‌ అందుకుంటారు.
8. చివరగా, మీకు ఇష్టమైన షోలు, మూవీలను వీక్షించేందుకు ‘Continue to Netflix’ని ఎంచుకోండి.

ముఖ్యంగా, నెట్‌ఫ్లిక్స్ ఆర్థిక నష్టాల కారణంగా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది. సుమారు 100 మిలియన్ల కుటుంబాలు పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకుంటున్నాయని కంపెనీ అంచనా వేసింది. అంటే.. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను చూస్తున్న యూజర్లందరూ ఎలాంటి పేమెంట్ చేయకుండానే చూసేస్తున్నారు. అందుకే, పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ ఈ కోల్పోయిన రాబడిలో కొంత భాగాన్ని తిరిగి పొందాలని భావిస్తోంది.

Read Also : Netflix : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారా? ఇకపై కష్టమే.. పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..