Bajaj Electric : ఓలా, ఏథర్ ఇక కాస్కోండి.. బజాజ్ మరో సంచలనం.. పెట్రోల్ బండ్లు దండగ.. తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందిగా..!

Bajaj Chetak Electric : ఓలా, ఏథర్ దిగ్గజాలకు పోటీగా బజాజ్ నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గుచూపేలా అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

Bajaj Chetak Electric

Bajaj Chetak Electric : ప్రస్తుతం పెట్రోల్ బండ్ల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలకే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ కోసం డబ్బులు వెచ్చించడం ఎందుకు దండగ అనే ధోరణి కనిపిస్తోంది.

వినియోగదారుల డిమాండ్ అనుగుణంగా టూవీలర్ తయారీ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా తయారుచేసి రోడ్లపైకి వదులుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ కొత్త స్కూటర్లను మార్కెట్లోకి దించుతూ వేగంగా దూసుకుపోతున్నాయి.

Read Also : AC Safety Tips : వేసవిలో ఏసీలు పేలుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. మీ ఏసీని వాడే ముందు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. సేఫ్టీ టిప్స్ మీకోసం..!

చాలా మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చాయి. బజాజ్ కంపెనీ కూడా పోటీగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే బజాజ్ తన మార్కెట్ వాటాను విస్తరించగా ఇప్పుడు మరింత పెంచుకోవాలని చూస్తోంది.

ఇందులో భాగంగా కొత్త, సరసమైన మోడళ్లను మార్కెట్లోకి దించుతోంది. కొత్త డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. బజాజ్ స్పై షాట్లను పరిశీలిస్తే.. అతి త్వరలోనే కొత్త సరసమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ రోడ్ టెస్టింగ్ సందర్భంగా కనిపించింది.

బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ మోడల్ పేరు ఇంకా రివీల్ చేయలేదు. కానీ, అది సరసమైన ధరలో రాబోయే బజాజ్ చేతక్ అంటూ ఊహాగానాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత బజాజ్ చేతక్‌తో పోలిస్తే.. ఈ కొత్త స్కూటర్ సైజులో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సరసమైన స్కూటర్‌తో చేతక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించే అవకాశం ఉంది.

బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దాదాపు రూ. 80వేల ప్రారంభ ధరకు లాంచ్ చేసే అవకాశం ఉంది. గత మోడళ్లతో పోల్చితే.. చేతక్ రేంజ్ రూ. 96వేల నుంచి ప్రారంభమవుతుంది. 2025 చివరి నాటికి లేదా 2026లో ఈ కొత్త బజాజ్ చేతక్ స్కూటర్ లాంచ్ కావచ్చు.

భారత మార్కెట్లో ఇప్పటికే బజాజ్ అనేక పేర్లను రిజిస్టర్ చేసుకుంది. అందులో ఈ స్కూటర్‌ ఒకటి కావచ్చు. ఇందులో టెక్నిక్, టెక్నికా, జింగర్, బాంబర్, ఎలిక్సిర్, ఆరా వంటి పేర్లు ఉన్నాయి. ప్రస్తుత బేస్ మోడల్ చేతక్ 2903 కన్నా తక్కువ సంఖ్యను కలిగి ఉంటుంది.

బజాజ్ చేతక్‌లో కనిపించే విధంగా రెట్రో వైబ్‌లు కొత్త మోడల్‌లో కూడా ఉన్నాయి. వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లు, ఓవల్ రియర్-వ్యూ మిర్రర్లు, వైడ్ ఫ్రంట్ ఫెండర్ ఉన్నాయి. స్కూటర్‌లో చేతక్ మాదిరిగానే వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే అవకాశం ఉంది. ఇతర రెట్రో డిజైన్ అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది.

కనిపించే హార్డ్‌వేర్‌లో అల్లాయ్ వీల్స్ (12-అంగుళాల యూనిట్లు), డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. అయితే, బ్యాక్ సైడ్ డ్రమ్ సెటప్ పొందవచ్చు.

చేతక్‌లో డ్యూయల్ టెయిల్ లాంప్ డిజైన్ ఉన్నప్పటికీ.. ఈ కొత్త మోడల్‌ను సింగిల్-పీస్ టెయిల్ లాంప్ ఫార్మాట్‌తో చూడవచ్చు. డైమెన్షనల్ పరంగా కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌తో పోలిస్తే.. మరింత కాంపాక్ట్ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. పట్టణాల్లో కనిపించే భారీ ట్రాఫిక్‌లో కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్, రేంజ్ ఎంతంటే? :
ఈ కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సరసమైన ధరలో ఉండే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉండవచ్చు. తక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఫలితంగా తక్కువ రేంజ్ ఉంటుంది. చేతక్ బేస్ వేరియంట్ (2903) 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో రావొచ్చు.

అప్పుడు ఈ స్కూటర్ రేంజ్ 123 కి.మీ వరకు ఉంటుంది. చేతక్ టాప్ వేరియంట్ 3501, 3502 కూడా 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చాయి. ఈ స్కూటర్ల పరిధి 153 కి.మీ రేంజ్ అందిస్తాయి. రాబోయే బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ కూడా తక్కువగా ఉండవచ్చు. చేతక్ బేస్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కి.మీ అందిస్తుంది. అయితే టాప్ వేరియంట్ గంటకు 73 కి.మీ వేగాన్ని అందుకోగలదు.

Read Also : iQOO vs Poco vs Nothing : ఈ మూడు ఫోన్లు కిర్రాక్.. పోటాపోటీ ఫీచర్లు.. ఏది కొంటే బెటర్..? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా?

నో-ఫ్రిల్స్ స్కూటర్ :
చేతక్‌లో మిడ్-మౌంటెడ్ మోటారు ఉన్నప్పటికీ, కొత్త స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుందని భావిస్తున్నారు. చాలా చౌకగా ఉంటుంది. బజాజ్ కొత్త స్కూటర్‌ను సరసమైన ధరకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగమే లక్ష్యంగా కొత్త బజాజ్ స్కూటర్ కొన్ని ప్రీమియం ఫీచర్లు ఉండకపోవచ్చు. ఉదాహరణకు.. చేతక్ కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌ను నెగటివ్ LCD డిస్‌ప్లేతో రిప్లేస్ చేయవచ్చు. ప్రస్తుత చేతక్‌లో అందుబాటులో ఉన్న ఆప్షన్లతో పోలిస్తే.. కొత్త ఈవీ స్కూటర్ బేస్ వేరియంట్‌లు కూడా తక్కువ కనెక్టివిటీ ఫీచర్లతో రావచ్చు.