New Whatsapp Feature Will Let You Quickly Delete Accidentally Posted Status Updates
New WhatsApp Feature : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వస్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామందికి వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ చేయడంతోనే ఆ రోజు మొదలవుతుంది. వాట్సాప్ స్టేటస్ పోస్టు చేసే సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటుంది. ఒకటి పెట్టబోయ మరోకటి స్టేటస్ పెట్టేస్తుంటారు. ఇలా పెట్టినప్పుడు ఆ స్టేటస్ వెంటనే డిలీట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోపు ఆ స్టేటస్ ఇతరులు చూసే ఛాన్స్ ఉంది. ఇకపై క్షణం కూడా వేచి చూడాల్సిన పనిలేదు. రాబోయే ఈ సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ Undo ఫీచర్ ద్వారా ఇతరులు చూడటానికి ముందే స్టేటస్ Undo చేసేయొచ్చు.
ఈ కొత్త Undo బటన్ ద్వారా అనుకోకుండా స్టేటస్ పెడితే వెంటనే డిలీట్ చేసేయొచ్చు. ప్రస్తుతం స్టేటస్ పెట్టి వెంటనే డిలీట్ చేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది. స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే.. అక్కడ మీకు మూడు డాట్స్ కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేస్తే.. డిలీట్ ఆప్షన్ ఎలాగో కనిపిస్తుంది. ఇలా కూడా స్టేటస్ డిలీట్ చేసేయొచ్చు. అప్పటివరకూ ఆగాల్సిన అవసరం లేకుండా ఈ Undo బటన్ ఫీచర్ ద్వారా క్షణాల వ్యవధిలోనే స్టేటస్ రిమూవ్ చేసేయొచ్చు.
వాట్సాస్ స్టోరీస్ అధికంగా పెడుతుండేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఈ Undo ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని WBetaInfo ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా స్టేటస్ పొరపాటున పోస్టు చేసినా కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసేయొచ్చు. Undo Status ఫీచర్ ముందుగా iOS వెర్షన్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆపై ఆండ్రాయిడ్ వెర్షన్ వాట్సాప్‌లో కూడా ఈ స్టేటస్ Undo ఫీచర్ తీసుకురానుంది వాట్సాప్.