Fake iPhone 13 Models : మార్కెట్లో నకిలీ ఐఫోన్ 13 మోడల్స్ సేల్.. ఐఫోన్ కొనే ముందు జాగ్రత్త.. మీ ఫోన్ ఒరిజినల్ అవునో కాదో ఇలా చెక్ చేసుకోండి..!
ప్రముఖ ఆపిల్ ఐఫోన్లు (Apple iPhones) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. మార్కెట్లో సరికొత్త ఐఫోన్లపై అత్యుత్తమ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఐపోన్లను కొనుగోలు చేసేందుకు లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

Noida gang caught selling fake iPhone 13 models, how to check if your iPhone is original or not
Fake iPhone 13 Models : ప్రముఖ ఆపిల్ ఐఫోన్లు (Apple iPhones) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. మార్కెట్లో సరికొత్త ఐఫోన్లపై అత్యుత్తమ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఐపోన్లను కొనుగోలు చేసేందుకు లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. భారత మార్కెట్లో లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్లు రిటైల్ ధర దాదాపు రూ.1 లక్షకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో నకిలీల మార్కెట్ కూడా విస్తరిస్తోంది. ఇటీవలి కేసులో ఢిల్లీ NCRలో నోయిడా పోలీసులు ఐఫోన్ 13 నకిలీలను తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను ఛేదించారు.
నివేదిక ప్రకారం.. గ్రూపులో ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. 60కి పైగా నకిలీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీ నుంచి రూ.12వేలకు తక్కువ ధరకు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని తేలింది. ఐఫోన్ ప్యాకేజింగ్ అసలైనదిగా కనిపించేలా నకిలీ మొబైల్ ఫోన్లను ఐఫోన్ బాక్స్‌లలో ప్యాక్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ ముఠా ఒక చైనీస్ ఆన్లైన్ రిటైలర్ నుంచి నిజమైన ఐఫోన్ బాక్స్‌లను రూ. 4,500 ఆపిల్ స్టిక్కర్లను ఒక్కొక్కటి రూ. 1,000 చొప్పున కొనుగోలు చేసింది. నకిలీ ఆపిల్ ప్యాకేజింగ్‌తో ఉన్న నకిలీ ఫోన్లను రూ.53,000కు విక్రయించింది. ఐఫోన్ ప్యాకేజింగ్ చాలా అధునాతనమైనదిగా కనిపిస్తోంది. ఐఫోన్ తయారీదారులు ఎల్లప్పుడూ ప్రామాణికమైన రిటైలర్ల నుంచి ప్రొడక్టులను కొనుగోలు చేయమని చెప్పవచ్చు. ఐఫోన్ వంటి ఖరీదైన ఫోన్ల కోసం.. నకిలీ లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. మీ ఐఫోన్ నకిలీదా లేదా ఒరిజినల్ ఫోన్ అని మీరు చెక్ చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
* అన్ని స్మార్ట్ఫోన్లు IMEI అని పిలిచే15-17-అంకెల యూనిక్ న్యుమరిక్ నెంబర్ ఉంటుంది. అసలైన డివైజ్‌లను ప్రత్యేకంగా గుర్తించడానికి సర్వీస్ ప్రొవైడర్లచే కోడ్ వినియోగిస్తారు.
* మీరు Settings >General> About సెక్షన్ ద్వారా మీ ఐఫోన్ IMEI నంబర్ కోసం చెక్ చేయవచ్చు.
* IMEI నంబర్ లేకపోతే, మీ ఐఫోన్ బహుశా నకిలీ మోడల్ కావచ్చు.
* మీ వద్ద మీ ఐఫోన్ లేకపోతే.. మీరు ఆన్లైన్లో కూడా IMEI నంబర్ కోసం చెక్ చేయవచ్చు.

Noida gang caught selling fake iPhone 13 models, how to check if your iPhone is original or not
* ఏదైనా వెబ్ బ్రౌజర్లో appleid.apple.comని విజిట్ చేయండి.
* మీ డివైజ్‌లో Apple IDతో సైన్ ఇన్ చేయండి.
* మీ డివైజ్‌లో ఇప్పుడు డివైజ్ సెక్షన్ ఎంచుకోండి.
* మీరు సిరీస్, IMEI/MEID నంబర్‌ను చూస్తారు. డివైజ్ ఎంచుకోండి.
* మీరు కొత్త ఐఫోన్‌ని కొనుగోలు చేసినట్లయితే.. మీ iPhone సెట్టింగ్‌లలోని IMEI నంబర్‌ను క్రాస్-చెక్ చేసి, బాక్స్‌పై ఉన్న IMEI నంబర్‌తో చెక్ చేయండి.
మీ ఐఫోన్ కవరేజీని చెక్ చేయండి :
* iPhone కవరేజ్ మీ iPhone వారంటీ గురించి వివరాలను అందిస్తుంది.
* mysupport.apple.comకి వెళ్లండి.
* మీ Apple IDతో సైన్ ఇన్ చేయండి.
* మీ డివైజ్ ఎంచుకోండి. హార్డ్‌వేర్ రిపేర్, టెక్నాలజీ సపోర్టుతో సహా మీ iPhone సపోర్టు గురించి Apple మీకు వివరాలను అందిస్తుంది.
* మీ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను చెక్ చేయండి

how to check if your iPhone is original or not
* ఐఫోన్ iOSలో రన్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ, నకిలీలు, నకిలీ ఐఫోన్లలో మీరు ఆండ్రాయిడ్ లేదా ఇతర OSలో రన్ అవుతుంటాయి.
* iOS Android నుంచి భిన్నంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అన్ని డిజైన్, లుక్‌లు ప్రజలను నమ్మించేలా ఉంటాయి.
* మీ ఐఫోన్ Settingsకు వెళ్లండి> Software ట్యాబ్ ఓపెన్ చేయండి> ఐఫోన్ రన్ అవుతున్న ఆపరేటింగ్ సిస్టమ్‌ను Check చేయండి.
అలాగే, ఒరిజినల్ ఐఫోన్లు సఫారి, హెల్త్, iMovie వంటి అనేక ఇతర యాప్‌లను కలిగి ఉంటాయి. మీరు దాన్ని కూడా చెక్ చేయవచ్చు.
మీ ఐఫోన్ ఫిజికల్ స్టేటస్ చెక్ చేయండి :
నకిలీ ఐఫోన్లు డిజైన్‌లో మార్పులు, తక్కువ నిర్మాణ నాణ్యతను కలిగి ఉంటాయి. కెమెరా మాడ్యూల్, ఫ్రేమ్‌లు, నాచ్ ఎలా ఉందో చెక్ చేయండి. లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌లు మెటల్, గ్లాస్ బిల్ట్‌తో వస్తాయి. అదనంగా, ఐఫోన్లు మెజారిటీ ఆండ్రాయిడ్ ఫోన్ల వలె USB టైప్ C పోర్ట్‌లతో రావు. మీరు దిగువన లైటనింగ్ కనెక్టర్ ఉందో లేదో చెక్ చేయండి.
అధికారిక స్టోర్ విజిట్ చేయండి :
మీరు కొనుగోలు చేసిన ఐఫోన్ 13 మోడల్ ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. మీ iPhoneని చెక్ చేసుకోండి. అధికారిక Apple స్టోర్‌ని విజిట్ చేయండి. మీ డివైజ్ ఒరిజినల్‌దా, నకిలీదా అని ఎగ్జిక్యూటివ్‌లు చెక్ చేసి మీకు తెలియజేస్తారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..