Nothing Ear (2) India price tipped ahead of March 22 launch, here is all we know
Nothing Ear (2) Price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి కొత్త నథింగ్ ఇయర్ (2) ఇయర్‌ఫోన్ వచ్చేస్తోంది. మార్చి 22న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అయితే, లాంచ్‌కు ముందే.. రాబోయే ఆడియో ప్రొడక్టులకు సంబంధించిన అనేక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు, నథింగ్ ఇయర్ (2) ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇయర్‌ఫోన్‌ల ధర రూ. 10వేల లోపు ఉంటుంది.
అలాగే, స్లాష్‌లీక్స్ ప్రకారం.. నథింగ్ ఇయర్ (2) భారత మార్కెట్లో రూ. 9,999 లేదా రూ. 10,999 ప్రారంభ ధరతో వస్తుంది. నథింగ్ ఇయర్ (1) దేశంలో రూ.6,999కి అందుబాటులోకి వచ్చింది. లీక్ అయిన ధర నిజమని తేలితే.. కంపెనీ న్యూ జనరేషన్ ధరను దాదాపు రూ.3వేలు లేదా రూ.4వేల మధ్య ఉండనుంది. అదేగానీ నిజంగా జరిగితే.. నథింగ్ ఇయర్ (2) కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాత, కొత్త వెర్షన్ మధ్య ధర తేడా చాలా ఎక్కువగా ఉంది.
Nothing Ear (2) India price tipped ahead of March 22 launch
దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం రివీల్ చేయలేదు. నథింగ్ నుంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు LHDC 5.0కి సపోర్టు చేస్తుందని కంపెనీ ఇప్పటివరకు ధృవీకరించింది. వినియోగదారులు హై-రెస్ ఆడియోను పొందవచ్చు.TWS ఇయర్‌ఫోన్‌లు డెస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్షన్ IP54 రేట్ అందిస్తోంది.
లీక్‌ల ప్రకారం.. నథింగ్ ఇయర్ (2) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్టు అందిస్తోంది. 11.6mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. ఇయర్ (1) కూడా అందిస్తుంది. ఇయర్‌బడ్‌లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు వస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో, యూజర్లు 36 గంటల బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. ఇటీవలి లీక్ కొత్త వెర్షన్ నథింగ్ ఇయర్ (1) మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుందని సూచించింది.
నథింగ్ ఇయర్ (2) సెమీ-ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కాంపాక్ట్ స్క్వేర్ కేస్‌ను కలిగి ఉంటుందని రెండర్‌లు చూపిస్తున్నాయి. లీకైన రెండర్ ప్రకారం.. ఈ డివైజ్ కేసులో మెటల్ కీ కూడా ఉంటుంది. వైట్ కలర్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇయర్‌బడ్‌లు స్టిక్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. మునుపటి వెర్షన్ మాదిరిగానే సిలికాన్ బడ్‌లను కలిగి ఉన్నాయి. నథింగ్ ఇయర్ (2) ఫీచర్లు, ధర మార్చి 22న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది.
Read Also : Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా CNG మోడల్ కారు లాంచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?