Nothing Phone 2 Launch : అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2 వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Nothing Phone 2 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2 వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే కీలక ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది.

Nothing Phone 2 Launch : అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2 వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Nothing Phone 2 Confirmed to Get Snapdragon 8+ Gen 1 SoC_ All Details

Updated On : May 18, 2023 / 10:22 PM IST

Nothing Phone 2 Launch In India Soon : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ ఫోన్ (Nothing) నుంచి మరో కొత్త ఫోన్ రాబోతోంది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నథింగ్ సీఈఓ కార్ల్ పీ ఫోన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ నథింగ్ ఫోన్ చిప్‌సెట్‌ గురించి ఆయన ధృవీకరించలేదు. గత నివేదికల ప్రకారం.. నథింగ్ ఫోన్ 1 అప్‌గ్రేడ్ మోడల్‌గా నథింగ్ ఫోన్ (2) ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉందనిన భావిస్తున్నారు.

నథింగ్ నుంచి మొదటి ఫోన్ ట్రన్స్‌పరెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్-ప్రొటెక్షన్ బ్యాక్ ప్యానెల్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది. నథింగ్ ఫోన్ ఔత్సాహికులు కంపెనీ నుంచి రెండో ఫోన్‌కు గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో రావొచ్చునని భావిస్తున్నారు. (Pei OnePlus) సహ వ్యవస్థాపకుడు, సంస్థను వీడి 2020లో నథింగ్‌ కంపెనీ స్థాపించాడు. నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా రానుందని కార్ల్ పీ ధృవీకరించారు. నథింగ్ ఫోన్ 1 నుంచి స్పష్టమైన అప్‌గ్రేడ్ అని కార్ల్ పీ పేర్కొన్నారు.

Read Also : Nokia 106 4G : ఇన్‌బిల్ట్ యూపీఐ పేమెంట్ ఆప్షన్‌తో నోకియా ఫీచర్ ఫోన్లు.. కేవలం ధర రూ. 1,299 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి..!

కార్ల్ పీ ప్రకారం.. నథింగ్ ఫోన్ 2లో యాప్ ఓపెనింగ్ స్పీడ్.. నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే.. రెండింతలు వేగంగా ఉందని ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ముందున్న దానితో పోలిస్తే.. 80 శాతం ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బూస్ట్‌ను అందిస్తాయని నివేదిక తెలిపింది. నథింగ్ ఫోన్ 1 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC ద్వారా ఆధారితమైనది. రాబోయే నథింగ్ ఫోన్ 2 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్ మెరుగైన బ్యాటరీ లైఫ్, నెట్‌వర్క్ కనెక్టివిటీ, కెమెరా క్వాలిటీ వంటి స్పీడ్‌తో పాటు ఇతర ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

Nothing Phone 2 Confirmed to Get Snapdragon 8+ Gen 1 SoC_ All Details

Nothing Phone 2 Launch Confirmed to Get Snapdragon 8+ Gen 1 SoC_ All Details

స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC, 18-బిట్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP)ని కలిగి ఉంది. నథింగ్ ఫోన్ (1)లో ఉపయోగించిన ISP కన్నా 4వేల రెట్లు ఎక్కువ కెమెరా డేటాను క్యాప్చర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. నథింగ్ ఫోన్ 2లోని కెమెరా 60 fps వద్ద HDR, 4K రికార్డింగ్ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లను అందించాలని భావిస్తోంది.

నథింగ్ ఫోన్ (2)లో 4nm TSMC స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ SoC బెస్ట్-ఇన్-క్లాస్ పవర్, హీట్ మేనేజ్‌మెంట్ వంటి ఫంక్షనాలిటీని అందిస్తుంది. చిప్‌సెట్ ఆప్షన్ SoC అప్‌గ్రేడ్ వెర్షన్‌తో రానుంది. ఒక ఏడాది క్రితం ప్రారంభం నుంచి అనేక అప్‌డేట్స్ ద్వారా టెస్టింగ్, సాధారణ ఆప్టిమైజేషన్‌లతో రానుంది. గతంలో కన్నా ఇప్పుడు అత్యుత్తమ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని తెలిపాడు.

Qualcomm లేటెస్ట్, స్పీడ్ Snapdragon 8 Gen 2 SoCతో వస్తుంది. కంపెనీ చివరి స్మార్ట్‌ఫోన్‌ కన్నా మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లతో రానుంది. నథింగ్ ఫోన్ (1) బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఈ ఫోన్ (8GB + 128GB స్టోరేజీ) ధర రూ. 32,999 ఉండగా, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్‌ల ధర వరుసగా రూ. 35,999, రూ. 38,999 అందుబాటులో ఉన్నాయి.

Read Also : iQoo Neo 8 Series : మే 23న ఐక్యూ నియో 8 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. 9 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్..!