OnePlus 12 India Launch : భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 23నే లాంచ్.. పూర్తి వివరాలు ఇవే..!

OnePlus 12 India Launch : రాబోయే కొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. ఈ బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 12 India Launch On January 23_ Features, Price in India And Others We Expect To See

OnePlus 12 India Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ 12 ఫోన్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ మరికొద్ది రోజుల దూరంలో ఉంది. భారత మార్కెట్లో జరగబోయే పెద్ద ఈవెంట్‌కు తుది మెరుగులు దిద్దడంలో కంపెనీ బిజీగా ఉంది. వన్‌ప్లస్ 12 బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. యాదృచ్ఛికంగా 10 ఏళ్ల క్రితమే కంపెనీ ప్రయాణాన్ని ప్రారంభించింది.

Read Also : Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు భారత్ సహా యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాంచ్ కానుంది. గ్లోబల్ లాంచ్ భారత మార్కెట్లో జరుగనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

లాంచ్ తేదీ, టైమ్ వివరాలివే :
వన్‌‌ప్లస్ 12 భారత్ లాంచ్ జనవరి 23 (మంగళవారం) గ్లోబల్ ఈవెంట్ ఢిల్లీలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. వన్‌ప్లస్ అధికారిక యూట్యూబ్ పేజీలో సామాజిక ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండనుంది.

వన్‌ప్లస్ 12 ధర, ఫీచర్లు ఇవే :
వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త ఏఐ చిప్ కారణంగా మాత్రమే కాకుండా హాసల్ బ్లాడ్‌తో అభివృద్ధి చేసిన కొత్త ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను ఉపయోగిస్తుందని పుకార్లు వచ్చాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ అమోల్డ్ క్యూహెచ్‌డీ+ (1,440 x 3,168) డిస్‌ప్లేను పొందుతుంది. 2600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో (2000నిట్స్), పిక్సెల్ 8 ప్రో (2400నిట్స్)తో సహా కొన్ని ఇటీవలి ఫ్లాగ్‌షిప్‌ల కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది.

OnePlus 12 India Launch On January 23

ఈ డివైజ్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే పెద్ద 5,400ఎంఎహెచ్ బ్యాటరీతో కూడా వస్తుంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ 12 భారత్ లాంచ్ ధర 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ దాదాపు రూ. 65వేలు ఉండవచ్చునని అంచనా. మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త చిప్‌సెట్‌తో సరసమైన రెండవ ఫోన్ మాత్రమే.

వన్‌ప్లస్ 12 లాంచ్ ఈవెంట్.. ఏం ఆశించవచ్చు? :
వన్‌ప్లస్ 12 లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ కొత్త వన్‌ప్లస్ బడ్స్ 3 ఇయర్‌బడ్స్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో మునుపటి గత ఫ్లాగ్‌షిప్ ఎస్ఓసీ, స్పాప్ డ్రాగన్ 8 జెన్ 2 అమర్చి ఉంటుందని భావిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ ప్రామాణికంగా కలిగి ఉండాలి. 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉండాలి. వన్‌ప్లస్ బడ్స్ 3 తక్కువ ధర ట్యాగ్‌లో ప్రో-లాంటి ఫీచర్‌లను పొందవచ్చు. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరికొన్ని నిఫ్టీ టూల్స్‌ను అందిస్తుంది.

Read Also : Kia Seltos Diesel MT Launch : కియా సెల్టోస్ డీజిల్ ఎంటీ మోడల్ కారు వచ్చేసింది.. మొత్తం 5 మోడల్స్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?