Best 5G Phone Deals : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12, ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్లు.. ఈ బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ ఎలా పొందాలంటే?
Best 5G Phone Deals : అమెజాన్, విజయ్ సేల్స్ ద్వారా అనేక 5జీ ఫోన్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ హై-ఎండ్ డివైజ్‌లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్‌లను పొందవచ్చు. బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ ఎలా పొందాలంటే?

OnePlus 12, iPhone 15, and more are available with discount offers
Best 5G Phone Deals : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, విజయ్ సేల్స్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లు అనేక 5జీ ఫోన్‌లపై తగ్గింపులను అందిస్తున్నాయి. పాత లేదా తక్కువ ధర కలిగిన హ్యాండ్‌సెట్‌లపైనే కాకుండా లేటెస్ట్ హై-ఎండ్ డివైజ్‌లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్‌లను పొందవచ్చు. వన్‌ప్లస్ 12, ఐఫోన్ 15, ఐక్యూ జెడ్7 ప్రో, రెడ్‌మి 13సి వంటి ఫోన్లు సరసమైన ధరలో అమ్మకానికి ఉన్నాయి. కొన్ని బెస్ట్ 5జీ ఫోన్ డీల్‌లను ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్15 రూ. 71,155 ధరతో అందుబాటులో ఉంది. ఎటువంటి అదనపు బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా తక్కువ ధరకే ప్రో వెర్షన్లు కొనుగోలు చేయొచ్చు. పాత మోడల్‌లతో పోలిస్తే.. కెమెరా, సాధారణ పనితీరు అందిస్తోంది. తక్కువ ధర గల మోడల్‌లలో ప్రో డిజైన్‌ను కూడా పొందవచ్చు. ధరల విషయానికి వస్తే.. వినియోగదారులు ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 8,745 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల అదనపు డిస్కౌంట్ :
విజయ్ సేల్స్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ.67,155కి తగ్గనుంది. 128జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే యూజర్లు అమెజాన్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఐఫోన్ 15 మోడల్ రూ. 1,27,990కి జాబితా అయింది. అసలు ఐఫోన్ ధర రూ. 1,34,900 నుంచి తగ్గింది.

iPhone 15 discount offers
వన్‌కార్డు క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేలు తగ్గింపు :
వన్‌ప్లస్ 12 ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. అమెజాన్ వన్‌కార్డు క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేల తగ్గింపును ఇస్తోంది. అధికారిక వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా డివైజ్ కొనుగోలు చేసే వారు ఇతర ప్రయోజనాలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ ధర రూ.62,999కి తగ్గుతుంది. అసలు రిటైల్ ధర రూ.64,999కు పొందవచ్చు.
మీరు ఈ-కామర్స్ సైట్‌లలో కూడా ఈ ఆఫర్‌ను చూడలేరు. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో కూడిన ఐక్యూ జెడ్7 ప్రో మోడల్ రూ. 23,999కి విక్రయిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో మీరు రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు.

OnePlus 12 discount offers
పోకో ఎక్స్6పై ఎలాంటి తగ్గింపు ఆఫర్ లేదు. రూ. 22వేల ధరలో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ రేంజ్‌లో అందిస్తున్న చిప్‌సెట్, ఇతర బ్రాండ్‌లు దాదాపు రూ. 30వేల ధర కలిగిన ఫోన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 21,892కి జాబితా అయింది. దాదాపు రూ. 10వేల బడ్జెట్ ఉన్న 5జీ ఫోన్ అవసరమయ్యే వినియోగదారులు రెడ్‌మి 13సీని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ రూ. 10,999కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 500 తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు.