OnePlus 13 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత్‌లో వన్‌ప్లస్ 13 ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13పై జనవరి 10న ఓపెన్ సేల్‌కి రానుంది. ఈ లాంచ్ సేల్ ఆఫర్‌‌లో వినియోగదారులు ఫోన్‌పై రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు.

OnePlus 13 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత్‌లో వన్‌ప్లస్ 13 ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Launch

Updated On : January 8, 2025 / 9:53 PM IST

OnePlus 13 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్ వన్‌ప్లస్ 13 వచ్చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ గత మోడల్ వన్‌ప్లస్ 12 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే.. ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌పై లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్‌ను పొందలేరని గమనించాలి. నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుంది. కొత్త వన్‌ప్లస్ 13ని తగ్గింపు ధరతో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇదే సరైన అవకాశం. ఇంతకీ ఈ ఫోన్‌పై డిస్కౌంట్ ఎలా పొందాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం.. మెటా ఫ్యాక్ట్ చెకర్స్ ప్రొగ్రామ్ తొలగింపు.. ట్రంప్ మెప్పు కోసమేనా?

వన్‌ప్లస్ 13పై రూ. 5వేలు డిస్కౌంట్.. :
వన్‌ప్లస్ 13పై జనవరి 10న ఓపెన్ సేల్‌కి రానుంది. ఈ లాంచ్ సేల్ ఆఫర్‌లలో భాగంగా వినియోగదారులు లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు.. 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 69,999 ఉంటే.. వన్‌ప్లస్ 13 ధరను రూ. 64,999కి తగ్గిస్తుంది.

16జీబీ+512జీబీ స్టోరేజ్ మోడల్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.76,999కు పొందవచ్చు. మీరు పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్‌ను కలిగి ఉంటే ఈ మోడల్ ధర ధర రూ.71,999కి తగ్గుతుంది. 24జీబీ ర్యామ్+ 1టీబీ మోడల్ ధర రూ. 89,999తో లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ.84,999 ఖర్చు అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్ ఇతర ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయానికి వస్తుంది.

వన్‌ప్లస్ 13 కీలక స్పెషిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. ముందున్న వన్‌ప్లస్ 12 మాదిరిగా అదే సైజును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. హై బ్రైట్‌నెస్ సామర్థ్యాలను కలిగి ఉంది. సాధారణ మోడ్‌లో 1,600నిట్‌ల వరకు, గరిష్ట ప్రకాశం 4,500నిట్‌లకు చేరుకుంటుంది. మీరు కొత్త గ్లోవ్ సపోర్టు ఫీచర్‌ను కూడా చూడవచ్చు. శీతాకాలంలో ఢిల్లీ వంటి చలి వాతావరణంలో ఉన్న వినియోగదారులకు ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుంది. వినియోగదారుల చేతి గ్లౌజ్‌లను తీసివేయకుండా ఫోన్ ఆపరేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

OnePlus 13 Launch

OnePlus 13 Launch

వన్‌ప్లస్ 13 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. వన్‌ప్లస్ 13లో బిగ్ అప్‌గ్రేడ్ బ్యాటరీ సామర్థ్యమే. వన్‌ప్లస్ 12 ఫోన్ 5,400mAh నుంచి 6,000mAhకి పెంచింది. ఈ పెద్ద బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై దాదాపు 2 రోజుల వినియోగాన్ని అందించగలదని వన్‌ప్లస్ పేర్కొంది. ఈ ఫోన్ 100డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఏడాదిలో కేసుల ద్వారా మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టింది.

కెమెరా ముందు వన్‌ప్లస్ 13 ఫోన్ గత వెర్షన్ల నుంచి 50ఎంపీ ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. అయితే ఫోన్ టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లలో అప్‌గ్రేడ్‌ను సూచిస్తుంది. ఈ రెండూ ఇప్పుడు 50ఎంపీ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ను కలిగిన కెమెరా సిస్టమ్, 4కె/60ఎఫ్‌పీఎస్ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13 ఫోన్ ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. అదనపు ఫీచర్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. తడి చేతులతో కూడా అన్‌లాకింగ్‌ను అందిస్తుంది. మెరుగైన గేమింగ్ కోసం కొత్త అధునాతన వైబ్రేషన్ మోటార్ కూడా ఉంది.

Read Also : Best Mobile Phones 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!