OnePlus 13 Renders : శాటిలైట్ కనెక్టివిటీతో వన్‌ప్లస్ 13 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus 13 Renders : నివేదికలు నిజమైతే.. ఈ ఏడాది తరువాత అలాంటి వేరియంట్‌ని పొందే అవకాశం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీతో కూడిన హ్యాండ్‌సెట్ చైనా బయటి దేశాల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు.

OnePlus 13 Renders : శాటిలైట్ కనెక్టివిటీతో వన్‌ప్లస్ 13 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Could be Working Smartphone With Satellite Connectivity ( Image Credit : Google )

OnePlus 13 Renders : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ శాటిలైట్ కనెక్టివిటీతో పనిచేయనుంది. అయితే, ఈ వన్‌ప్లస్ ఫోన్‌కు సంబంధించి లీక్ అయిన రెండర్‌లు ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించాయి. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసే ముందు, వన్‌ప్లస్ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 ఫోన్ నెక్స్ట్ ప్రధాన ఓఎస్ అప్‌డేట్‌తో అప్‌గ్రేడ్ పొందవచ్చు.

Read Also : Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, బ్యాంకు ఆఫర్లు ఇవే

వన్‌ప్లస్ 12లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 బీటాను నిశితంగా పరిశీలిస్తే.. శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టు ఇచ్చే ఫోన్ ఎడిషన్‌ను సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా, గూగుల్ ఇటీవల ఐక్యూ, నథింగ్, వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మి, వివో, షావోమీ వంటి బ్రాండ్‌ల నుంచి అనేక ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను రిలీజ్ చేయడం ప్రారంభించింది.

ఆండ్రాయిడ్ 15 బీటా లేటెస్ట్ రిలీజ్‌ :
వన్‌ప్లస్ త్వరలో శాటిలైట్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావచ్చని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక పేర్కొంది. ఆండ్రాయిడ్ 15 బీటా లేటెస్ట్ రిలీజ్‌తో కనిపించిన వన్‌ప్లస్ 12 సెట్టింగ్‌ల యాప్‌లో ‘శాటిలైట్ మొబైల్ ఫోన్’ అని ఉన్న భాగాన్ని చూపుతుందని ట్విట్టర్ యూజర్ వన్ నార్మల్ యూజర్‌నేమ్ నివేదిక పేర్కొంది. ఒప్పో ఫైండ్ N3 సెట్టింగ్‌ల యాప్‌లో ఇదే విధమైన కోడ్‌ల స్ట్రింగ్ ఇటీవలే సరికొత్త ఆండ్రాయిడ్ 15 బీటా రిలీజ్‌తో కనిపించింది.

చివరికి శాటిలైట్ కనెక్టివిటీని కూడా సూచిస్తుంది. వన్‌ప్లస్ 12 ఒప్పో ఫైండ్ N3లో కనిపించే కోడ్‌ల మధ్య తేడా ఏమిటంటే.. కంపెనీ పేరు మాత్రమే. “శాటిలైట్ మొబైల్ ఫోన్” అనే పేరు రెండు కోడ్‌లలో కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఫ్యూచర్ వెర్షన్లు శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సపోర్టు ఇవ్వవచ్చునని సూచిస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సపోర్టు ఇచ్చే వన్‌ప్లస్ 12 వేరియంట్‌ను వన్‌‌ప్లస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

నివేదికలు నిజమైతే.. ఈ ఏడాది తరువాత అలాంటి వేరియంట్‌ని పొందే అవకాశం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీతో కూడిన హ్యాండ్‌సెట్ చైనా బయటి దేశాల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు. ప్రస్తుతం, చైనా వెలుపల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టు చేస్తాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 రిలీజ్‌తో కొత్త అప్‌గ్రేడ్ శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుందని గూగుల్ ధృవీకరించింది. టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ కవరేజీకి వెలుపల ఉన్న ప్రాంతాలలో యూజర్లు ఎస్ఎంఎస్, ఎమ్ఎమ్ఎస్ పంపడంలో లేదా స్వీకరించడంలో సాయపడుతుంది.

Read Also : Xiaomi Smart TV A32 Model : కొత్త షావోమీ స్మార్ట్‌టీవీ A32 మోడల్ వచ్చేసిందోచ్.. ధర రూ. 12,499 మాత్రమే..!