OnePlus’s Dhamaka Offer: వన్‌ప్లస్‌ 13s, నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్లపై కేక పెట్టించే ఆఫర్లు

ఈ ఆఫర్‌తో గూగుల్‌ అత్యాధునిక ఏఐ టెక్నాలజీలు లభిస్తాయి. ఇవి రీసెర్చ్, కంటెంట్‌, వీడియో క్రియేషన్, భారీ ఫైళ్ల స్టోరేజ్ వంటి వాటికి బాగా ఉపయోగపడతాయి.

OnePlus’s Dhamaka Offer: వన్‌ప్లస్‌ 13s, నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్లపై కేక పెట్టించే ఆఫర్లు

Updated On : August 12, 2025 / 3:03 PM IST

వన్‌ప్లస్‌ ధమాకా ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13s లేదా నార్డ్‌ 5 కొనుగోలు చేసేవారికి శక్తిమంతమైన ఏఐతో పాటు ఉచితంగా 2TB స్టోరేజ్‌ అందిస్తోంది ఆ కంపెనీ. వన్‌ప్లస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్‌ 13s లేదా నార్డ్‌ 5 కొనుగోలు చేసే యూపజర్లకు 2TB క్లౌడ్‌ స్టోరేజ్‌, 3 నెలల ఉచిత గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఈ ఆఫర్‌తో గూగుల్‌ అత్యాధునిక ఏఐ టెక్నాలజీలు లభిస్తాయి. ఇవి రీసెర్చ్, కంటెంట్‌, వీడియో క్రియేషన్, భారీ ఫైళ్ల స్టోరేజ్ వంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. మీ ఫోన్‌ను స్మార్ట్‌ వర్క్‌స్పేస్‌, క్రియేటివ్‌ హబ్‌గా మార్చుకోవచ్చు.

గూగుల్‌ ఏఐ ప్రో 3 నెలలు ఉచితం
జెమినీ 2.5 ప్రో ఏఐ చాట్‌, కంటెంట్‌ క్రియేషన్‌ వంటివాటిలో సహాయపడుతుంది. డీప్‌ స్టడీతో ఏ విషయం మీదైనా లోతైన అధ్యయనం చేయవచ్చు. వెయో 3 ఫాస్ట్‌ వీడియో జనరేషన్‌ ద్వారా స్క్రిప్ట్‌ను వీడియోగా మార్చవచ్చు. వ్లాగ్స్‌, వీడియోలు, సోషల్‌ మీడియా కంటెంట్‌ను వేగంగా సృష్టించవచ్చు.

Also Read: భారత మార్కెట్‌లో వివో V60 5G విడుదలైంది.. అబ్బబ్బ ఏముంది భయ్యా.. కెవ్వుకేక

2TB స్టోరేజ్‌ గూగుల్‌ డ్రైవ్‌లో (3 నెలలు ఉచితం)
పెద్ద ప్రాజెక్టుల డేటా, డాక్యుమెంట్లు, సినిమాలు, ఫొటోలు నిల్వ చేసుకునేందుకు తగిన ప్లేస్ ఉంటుంది. క్లౌడ్‌ స్టోరేజ్‌తో డేటా ఎక్కడినుంచైనా సురక్షితంగా పొందవచ్చు.

ఈ ఆఫర్‌ ప్రత్యేకత
ఇంతకుముందు ఫోన్‌తో కేవలం హార్డ్‌వేర్‌ మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఏఐ, ఆధునిక సౌకర్యాలు కూడా వస్తున్నాయి. 2TB స్టోరేజ్‌, శక్తిమంతమైన ఏఐ సాధనాలకు సాధారణంగా వేల రూపాయలు ఖర్చవుతాయి. ఈ ఆఫర్‌లో మాత్రం ఉచితం.