భారత మార్కెట్‌లో వివో V60 5G విడుదలైంది.. అబ్బబ్బ ఏముంది భయ్యా.. కెవ్వుకేక

ప్రీబుకింగ్స్‌ ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 19 నుంచి వివో వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వివో V60 మిస్ట్‌ గ్రే, మూన్‌లిట్‌ బ్లూ, ఆస్పిషియస్‌ గోల్డ్‌ రంగుల్లో వచ్చింది.

భారత మార్కెట్‌లో వివో V60 5G విడుదలైంది.. అబ్బబ్బ ఏముంది భయ్యా.. కెవ్వుకేక

Updated On : August 12, 2025 / 2:32 PM IST

వివో తన కొత్త కెమెరా ఫోకస్‌డ్‌ V60 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే, IP68/IP69 వాటర్‌ రెసిస్టెన్స్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌ రూ.50,000 లోపు సెగ్మెంట్‌లో ఒప్పో రెనో 14, వన్‌ప్లస్‌ 13ఆర్‌తో పోటీ పడుతుంది.

వివో V60 5G ధర
వివో V60 5G ధర రూ.36,999 (8జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌), రూ.38,999 (8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌), రూ.40,999 (12జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌), రూ.45,999 (12జీబీ ర్యామ్‌/512జీబీ స్టోరేజ్‌)గా ఉంది.

ప్రీబుకింగ్స్‌ ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 19 నుంచి వివో వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వివో V60 మిస్ట్‌ గ్రే, మూన్‌లిట్‌ బ్లూ, ఆస్పిషియస్‌ గోల్డ్‌ రంగుల్లో వచ్చింది.

Also Read: బ్యాంక్ అఫ్ బరోడాలో జాబ్స్.. 330 ఎస్వో పోస్టులకు నోటిఫికేషన్.. జీతం, అర్హత, దరఖాస్తు పూర్తి వివరాలు

వివో V60 5G స్పెసిఫికేషన్లు
వివో V60 5Gలో 6.77 అంగుళాల 120హెర్జ్‌ క్వాడ్‌ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 5,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2392×1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఉంది. IP68, IP69 రేటింగ్స్‌ ఉండడం వల్ల 1.5 మీటర్ల లోతు నీటిలో సుమారు 80 నిమిషాల పాటు మునిగినా పనిచేసే అవకాశం ఉంది.

ఈ డివైస్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ, 12జీబీ, 16జీబీ LPDDR4x ర్యామ్‌, 128జీబీ, 256జీబీ, 512జీబీ UFS 2.2 స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి.

కెమెరా విషయంలో జైస్‌ బ్రాండింగ్‌ ఉన్న ట్రిపుల్‌ రియర్‌ సెటప్‌ ఉంది. 50ఎంపీ ప్రైమరీ షూటర్‌ (OIS సపోర్ట్‌తో), 50ఎంపీ టెలిఫోటో లెన్స్‌, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ షూటర్‌ ఉన్నాయి. ముందు కెమెరా 50ఎంపీ సెన్సార్‌తో వస్తుంది.

మునుపటి మోడల్‌తో పోల్చితే బ్యాటరీ సామర్థ్యంలో పెద్ద పెరుగుదల చేసింది. ఇప్పుడు 6,500ఎంఏహెచ్‌ బ్యాటరీ, 90వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. ఫోన్‌ ఫన్‌టచ్‌ OS 15 (ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా)పై పనిచేస్తుంది. 4 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు అందిస్తామని వివో తెలిపింది.