OnePlus Nord CE 4 Launch : ఏప్రిల్ 1నే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లాంచ్.. ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ఏప్రిల్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus Nord CE 4 Launch : ఏప్రిల్ 1నే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లాంచ్.. ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 4 full specs leak ahead of April 1 launch event

OnePlus Nord CE 4 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ నుంచి ఏప్రిల్ 1న భారత్‌కు సరికొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ వచ్చేస్తోంది. అతికొద్ది రోజులలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, లాంచ్‌కు ముందే కంపెనీ ఈ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. లేటెస్ట్ లీక్ ప్రకారం.. నార్డ్ సీఈ 4 అన్ని స్పెషిఫికేషన్లను వెల్లడిస్తుంది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్.. భారత్‌లో ధర ఎంత ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.10,901 తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

వన్‌‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్పెషిఫికేషన్లు :
రాబోయే వన్‌ప్లస్ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. కంపెనీ కొత్త 5జీ ఫోన్‌లో సరికొత్త ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ఉందని వెల్లడించింది. ఈ డివైజ్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలిగి ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 8జీబీ వరకు పెంచవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ర్యామ్ విటాకు సపోర్టు ఇస్తుంది.

మల్టీ యాప్‌లను ఓపెన్ చేయడం లేదా వాటి మధ్య మారుతున్నప్పుడు ఒకేసారి 15 కన్నా ఎక్కువ విభిన్న యాప్‌ల మెమరీలో స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించడంలో ఈ ఫీచర్ సాయపడుతుందని వన్‌ప్లస్ తెలిపింది. ఈ డివైజ్ 256జీబీ స్టోరేజీతో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. 29 నిమిషాల్లో డివైజ్ 1-100 శాతం ఛార్జ్ చేస్తుంది. అదే సపోర్ట్ వన్‌ప్లస్ 12ఆర్ కూడా అందుబాటులో ఉంది. మీరు స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్పెషిఫికేషన్లు :
రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌లో వన్‌ప్లస్ బ్యాటరీ, కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 హుడ్ కింద 5,500ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ డివైజ్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ గత ఏడాదిలో రూ. 26,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. రాబోయే ఈ డివైజ్ నథింగ్ ఫోన్ 2ఎ, పోకో ఎక్స్6 ప్రో పోటీగా వస్తుంది.

Read Also : Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!