OnePlus Pad 2 Price : భారత్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 ధర తగ్గిందోచ్.. కొత్త ధర, ఆఫర్లు ఇవే..!
OnePlus Pad 2 Price : భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 8జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ. 39,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 42,999కు పొందవచ్చు.

OnePlus Pad 2 Price in India Discounted for Limited Time
OnePlus Pad 2 Price : వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లలో ఈ ఏడాది జూలైలో వన్‌ప్లస్ ప్యాడ్ 2 లాంచ్ అయింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ, 67డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,510mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 3కె ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది.
టాబ్లెట్ నింబస్ గ్రే కలర్‌వేలో అందిస్తోంది. 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ ఆప్షన్లలో లభిస్తుంది. టాబ్లెట్‌ను వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్, వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డ్ (విడిగా విక్రయం)తో పొందవచ్చు. పరిమిత సమయం వరకు కంపెనీ తగ్గింపు ధరతో టాబ్లెట్‌ను అందిస్తోంది.
భారత్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 ధర, డిస్కౌంట్లు, ఆఫర్‌లు :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 8జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ. 39,999. ఇంతలో, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 42,999కు పొందవచ్చు. నవంబర్ 6 అర్ధరాత్రితో ముగిసే పరిమిత-సమయ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. కొనుగోలుదారులు వన్‌ప్లస్ ప్యాడ్ 2 వరుసగా రూ. 37,999 రూ. 40,999 పొందవచ్చు. కస్టమర్లలో అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఈ డీల్ పొందవచ్చు.
ఆఫర్ వ్యవధిలో అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఆర్బీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు రూ. తగ్గింపు ధరపై రూ. 3వేల తగ్గింపు పొందవచ్చు. నెలకు రూ. 4,555 చొప్పున 9 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. కొనుగోలుదారులు రూ. 5వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 2 12.1-అంగుళాల 3K (2,120 x 3,000 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 303పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 900నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయి, డాల్బీ విజన్ సపోర్ట్‌ని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 14తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 2 ఫోన్ 13ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ 5.4, వై-ఫై 7, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. టాబ్లెట్‌కు 67డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9,510mAh బ్యాటరీ ఉంది. హై-రెస్ సర్టిఫైడ్ సిక్స్-స్పీకర్ సిస్టమ్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తుంది. 268.66×195.06×6.49ఎమ్ఎమ్ సైజు, 584 గ్రాముల బరువు ఉంటుంది.