OnePlus Pad : భారత్‌కు వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. లాంచ్ ఎప్పుడంటే?
OnePlus Pad : ప్రముఖ వన్‌ప్లస్ కంపెనీ (OnePlus) త్వరలో ఫస్ట్ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) అనే పేరుతో రానుంది. ఈ టాబ్లెట్ దేశంలో టెస్టింగ్‌లో ఉందని Mysmartprice రిపోర్టు తెలిపింది.

OnePlus Pad may launch in India soon, reportedly enters testing in India
OnePlus Pad : ప్రముఖ వన్‌ప్లస్ కంపెనీ (OnePlus) త్వరలో ఫస్ట్ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) అనే పేరుతో రానుంది. ఈ టాబ్లెట్ దేశంలో టెస్టింగ్‌లో ఉందని Mysmartprice రిపోర్టు తెలిపింది. ప్రస్తుత డివైజ్ ఇంటర్నల్‌గా వన్‌ప్లస్ ప్యాడ్ OnePlus 11Rతో పాటు ఈ ఏడాది జూన్‌లో లాంచ్ చేయొచ్చునని భావిస్తున్నారు.
OnePlus Pad Qualcomm Snapdragon 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. 12.4-అంగుళాల Full HD+ OLED స్క్రీన్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ డివైజ్ ముందు భాగంలో 8MP కెమెరాతో వస్తుందని చెప్పవచ్చు.
టాబ్లెట్ 6GB RAM ప్యాక్, గరిష్టంగా 128GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని అందించవచ్చు. OnePlus ప్యాడ్ వెనుక డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 5MP సెకండరీ సెన్సార్‌తో 13MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. రాబోయే OnePlus ప్యాడ్ 10,090mAh బ్యాటరీతో రానుంది. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించవచ్చు. టాబ్లెట్ ధర రూ. 30వేల కన్నా ఎక్కువ ఉండవచ్చని గతంలో నివేదిక సూచించింది. దీని ధర CNY 2,999గా నిలిచింది. సుమారుగా రూ. 34,500గా ఉండనుంది. ఈ డివైజ్ 2022లో లాంచ్ కానుంది.

OnePlus Pad may launch in India soon
OnePlus చైనాలో లేటెస్ట్ నంబర్ సిరీస్‌ను ప్రారంభించింది. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో కంపెనీ OnePlus 11 ఆవిష్కరించింది. హ్యాండ్‌సెట్ ColorOS 13.0తో Android 13లో రన్ అవుతుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20.1:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల QHD+ Samsung LTPO 3.0 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆన్ డిస్‌ప్లే సపోర్టును పొందవచ్చు. 1300 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో 525ppi పిక్సెల్‌తో వస్తుంది.
ఈ డివైజ్ వెనుకవైపు 3 కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. f/1.8 లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ 48MP సోనీ IMX58 అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో f/2.2 లెన్స్, 32MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. సెల్ఫీల కోసం af/2.4 లెన్స్‌తో ఫ్రంట్ సైడ్ 16MP సెన్సార్ ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..