Online Electricity Bill Scam in Telugu, how to stay safe, Check Full Details
Online Electricity Bill Scam : మీకు కరెంట్ బిల్లు చెల్లించాలంటూ ఇలా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. తొందరపడి ఆయా లింకులను అసలు క్లిక్ చేయొద్దు.. లేదంటే.. మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తారు స్కామర్లు. బాధితుల నుంచి డబ్బులు దొంగిలించేందుకు సైబర్ మోసగాళ్లు ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్ (Electricity Bill Scam in Telugu)కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ అనేకమంది బాధితులు ఈ ఫేక్ మెసేజ్‌లను నమ్మి తమ నగదును కోల్పోయారు. మీకు కూడా ఇలాంటి ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లించాలంటూ మెసేజ్ వస్తే అసలు స్పందించకండి.
‘డియర్ కస్టమర్.. మీ కరెంటు పవర్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే.. మీ మునుపటి నెల బిల్లు ఇంకాఅప్‌డేట్ కాలేదు. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారి (82603XXX42)ని సంప్రదించండి ధన్యవాదాలు.’ అని మీకు వాట్సాప్‌లో ఇలాంటి SMS లేదా మెసేజ్ ఏమైనా వచ్చిందా? అవును.. అయితే, జాగ్రత్త వహించండి.
ఆ నంబర్‌కు అసలు కాల్ చేయవద్దు లేదా ఈ మెసేజ్‌లో కనిపించే లింక్‌పై క్లిక్ చేయకండి.. దేశవ్యాప్తంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు ఫిషింగ్ లింక్‌లను కలిగిన స్కామ్‌లుగా కనిపించే మెసేజ్‌లు వస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మెసేజ్‌లతో అత్యవసర పరిస్థితిని క్రియేట్ చేయడానికి, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయడానికి, డబ్బులను దొంగిలించడానికి స్కామర్‌లు ప్రయత్నిస్తున్నారని గమనించాలి.
కరెంటు బిల్లు స్కామ్ అంటే ఏమిటి? :
ఆన్‌లైన్ స్కామ్‌లలో, మోసగాళ్ళు అధికారిక విద్యుత్ శాఖల నుంచి వచ్చినట్లు నమ్మించేలా ఫేక్ టెక్స్ట్ మెసేజ్‌లను పంపుతారు. ఈ మెసేజ్‌లు కరెంట్ బిల్లు చెల్లించలేదని, విద్యుత్తును తక్షణమే డిస్‌కనెక్ట్ చేస్తామనే హెచ్చరికలా ఉంటాయి. ఎవరైనా తొందరడి బిల్ పేమెంట్లు చేస్తే భారీగా మూల్యాన్ని చెల్లించుకోకతప్పదు. ఈ స్కామ్ మెసేజ్‌లు చట్టబద్ధంగా కనిపించేలా మెసేజ్‌లా ఉంటాయి.
స్కామర్‌లు అధికారిక లోగోలు, లాంగ్వేజీతో ఉంటాయి. అందులో వినియోగదారుల పేరు, అకౌంట్ నంబర్‌ను కూడా కలిగి ఉండవచ్చు. అందుకే, ఏది రియల్ మెసేజ్? ఏది ఫేక్ మెసేజ్ అనే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తుంది. ఫలితంగా, అనేక మంది వినియోగదారులు ఈ స్కామ్‌కు గురయ్యారు. స్కామర్లు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను కొల్లగొట్టారు.
Online Electricity Bill Scam in Telugu
నివేదిక ప్రకారం.. బాధితుడు తనకు విద్యుత్ శాఖకు చెందిన అధికారి అని చెప్పుకునే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు నివేదించారు. కరెంటు బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకుంటే విద్యుత్‌ను నిలిపివేస్తామని ఫోన్ చేసిన వ్యక్తి తెలియజేశాడు. బిల్లు ఎలా చెల్లించాలని బాధితుడు అడిగినప్పుడు, కాలర్ అతనికి (Teamviewer Quick support) మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను పంపాడు. బాధితుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే.. స్కామర్ అతని బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ పొందాడు. అతని మొత్తం డబ్బును, మొత్తం రూ. 4.9 లక్షలను సొంత అకౌంట్‌కు బదిలీ చేశాడు.
ఎలా సురక్షితంగా ఉండాలంటే? :
* అనుమానిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు విద్యుత్ బిల్లు చెల్లించలేదని మెసేజ్ లేదా ఇమెయిల్ వస్తే.. ప్రతిస్పందించవద్దు లేదా ఏదైనా లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
* మీ బిల్లులో లిస్టు చేసిన ఫోన్ నంబర్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించి నేరుగా మీ విద్యుత్ అధికారిని సంప్రదించండి.
* అనుమానిత మెసేజ్‌లలోని లింక్‌లు లేదా ఫోన్ నంబర్‌ల ద్వారా పేమెంట్లు చేయవద్దు.
* పేమెంట్ రిక్వెస్ట్ చట్టబద్ధత గురించి మీకు కచ్చితంగా తెలియకుంటే, చెల్లించాల్సిన మొత్తాన్ని సరైన పేమెంట్ పద్ధతులను నిర్ధారించడానికి నేరుగా మీ విద్యుత్ అధికారిని సంప్రదించండి.
* స్కామ్ హెచ్చరిక వంటి మెసేజ్‌ల గురించి తెలుసుకోండి.
* స్కామర్లు తరచుగా భయాందోళనలను క్రియేట్ చేయడానికి అత్యవసర భాష, డిస్‌కనెక్ట్ హెచ్చరికలను పంపుతారు.
* మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా సోషల్ సెక్యూరిటీ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా అడగవచ్చు.
* మీరు ఈ హెచ్చరిక సంకేతాలలో దేనినైనా కలిగిన మెసేజ్ స్వీకరిస్తే, అది స్కామ్ కావచ్చు.
* మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి.
* మిమ్మల్ని సంప్రదించే వారితో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయకండి.
* ఇందులో మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంటాయి.
* అనుమానిత మోసాలను మీ విద్యుత్ అధికారులకు రిపోర్టు చేయండి. మీరు స్కామ్‌కు గురైనట్లు విశ్వసిస్తే.. వెంటనే మీ విద్యుత్ అధికారి, పోలీసులను సంప్రదించండి.