Twitter Polls : ఏప్రిల్ 15 నుంచి ట్విట్టర్ పోల్స్.. వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే ఓటు వేయొచ్చు..!
Twitter Polls : మీరు ట్విట్టర్ పోల్‌లో పాల్గొనాలని చూస్తున్నారా? మీకు వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్ లేకపోతే ఏప్రిల్ 15 నుంచి మీరు ఓటు వేయలేరు. ఈ విషయాన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) సీఈఓ ఎలన్ మస్క్ మార్చి 28న ప్రకటించారు.

Twitter Polls _ Only Verified Accounts Can Vote In Twitter Polls From April 15 _ Elon Musk
Twitter Polls : మీరు ట్విట్టర్ పోల్‌లో పాల్గొనాలని చూస్తున్నారా? మీకు వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్ లేకపోతే ఏప్రిల్ 15 నుంచి మీరు ఓటు వేయలేరు. ఈ విషయాన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) మార్చి 28న ప్రకటించారు. మీ ట్విట్టర్ అకౌంట్లు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలని సూచించారు. లేదంటే.. ట్విట్టర్ పోల్స్ (Twitter Polls) సమయంలో ఓటు వేయడం కుదరదు. ఏప్రిల్ 15 నుంచి ట్విట్టర్ పోల్స్ నిర్వహించనున్నట్టు మస్క్ ప్రకటించారు. వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లు మాత్రమే ఓటు వేసేందుకు అర్హత ఉందని మస్క్ తెలిపారు.
అడ్వాన్స్‌డ్ AI బాట్ సమస్యను ఎదుర్కోవడమే ట్విట్టర్ లక్ష్యంగా పెట్టుకుంది. ట్విట్టర్‌లోని అకౌంట్ల నుంచి ట్వీట్‌ల స్ట్రీమ్‌ను అందించే ట్విట్టర్ సిఫార్సులలో వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే అర్హత పొందుతాయని మస్క్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే సిఫార్సులలో ఉండేందుకు అర్హత పొందుతాయి. మోడ్రాన్ AI బోట్ గ్రూపులను పరిష్కరించేందుకు ఇదే ఏకైక మార్గమని చెప్పవచ్చు.

Twitter Polls _ Only Verified Accounts Can Vote In Twitter Polls From April 15
ఈ ట్విట్టర్ పోల్స్ (Twitter Polls)లో ఓటింగ్‌కు వెరిఫికేషన్ అవసరమని సీఈవో మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ బ్లూ కొత్త ఫీచర్లలో, వెరిఫైడ్ యూజర్లు మాత్రమే లాంగ్ వీడియోలను పోస్ట్ చేయగలరు. (Twitter) బ్లూ ల్యాబ్‌లతో కొత్త ఫీచర్‌లను ఎంచుకోవడానికి ముందస్తుగా యాక్సెస్‌ను పొందవచ్చు.
Read Also : Nothing Ear (2) Sale in India : నథింగ్ ఇయర్ (2) సేల్ మొదలైంది.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?
బాట్ అకౌంట్లుతో సర్వీసు నిబంధనలను అనుసరిస్తే.. హ్యుమన్ మాదిరిగా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలోన్ మస్క్ ఇటీవలే వెరిఫైడ్ బాట్‌ల ధరను 10వేల శాతం పెంచుతున్నట్టు వెల్లడించాడు. ఫోన్ ద్వారా బాట్‌లను గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. మోడ్రాన్ AI ఏదైనా మీరు రోబోట్ కాదని టెస్టు ద్వారా గుర్తించవచ్చు. ప్రతి అకౌంటుకు ఒక్క పైసా కన్నా తక్కువ ఖర్చుతో 100k హ్యుమన్-వంటి బాట్‌లను స్పిన్ చేసే వీలుంది. ట్విట్టర్ పేమెంట్ వెరిఫికేషన్ బాట్ ధరను 10వేల శాతం పెంచుతుందని తెలిపాడు. ఫోన్, CC క్లస్టరింగ్ ద్వారా బాట్‌లను గుర్తించడం చాలా సులభంగా ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ పేమెంట్ అకౌంట్ మాత్రమే అవుతుందని మస్క్ తెలిపాడు. మస్క్ ట్వీట్‌కు చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొన్ని అకౌంట్లకు ఒకరోజు 130వేలు, మరుసటి రోజు 90వేలు ఫాలోవర్లు వచ్చినట్టు గమనించానని, అది నిజంగా బాట్‌ల వల్లనా? ఓ యూజర్ ప్రశ్నించాడు. మరో యూజర్ ఆటోమేటెడ్ అంటూ బదులిచ్చారు. ఇంతలో, ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగత యూజర్లతో పాటు సంస్థల ట్విట్టర్ అన్ని లెగసీ బ్లూ వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను తొలగిస్తుందని మస్క్ ప్రకటించారు. భారత్‌లో ట్విట్టర్ బ్లూ వ్యక్తిగత యూజర్లు సంవత్సరానికి రూ. 9,400 చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించేందుకు పాలసీ సంబంధిత పోల్స్‌లో ఓటింగ్‌ను పరిమితం చేస్తుందని మస్క్ పేర్కొన్నారు.