Oppo Find X8 Series : ఒప్పో ఫైండ్ X8 సిరీస్ సేల్ మొదలైందోచ్.. రూ. 10వేల వరకు తగ్గింపు.. మరెన్నో స్పెషల్ ఆఫర్లు..!

Oppo Find X8 Series : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 79,999కు పొందవచ్చు.

Oppo Find X8 Series : ఒప్పో ఫైండ్ X8 సిరీస్ సేల్ మొదలైందోచ్.. రూ. 10వేల వరకు తగ్గింపు.. మరెన్నో స్పెషల్ ఆఫర్లు..!

Oppo Find X8 Series now on sale

Updated On : December 5, 2024 / 12:18 AM IST

Oppo Find X8 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్ ఎక్స్8 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఉన్నాయి. ఈ రెండు మోడల్‌లు అత్యాధునిక ఫీచర్లను అందిస్తాయి. ఇందులో నాలుగు వరకు హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ 50ఎంపీ కెమెరాలతో పాటు భారీ బ్యాటరీలు ఉన్నాయి.

ధర, ఆఫర్లు వివరాలివే :
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 79,999కు పొందవచ్చు. స్పేస్ బ్లాక్, స్టార్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఒప్పో ఫోన్ ధర రూ. 99,999కు పొందవచ్చు. కొనుగోలుదారులు పర్ల్ వైట్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఒప్పో కాన్ఫిగరేషన్‌ను బట్టి ప్రో మోడల్‌పై రూ. 9,999 వరకు తగ్గింపు, స్టాండర్డ్ వేరియంట్‌పై రూ. 6,999 నుంచి రూ. 7,999 వరకు తగ్గింపులను అందిస్తోంది. అదనంగా, కస్టమర్‌లు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం క్యాష్‌బ్యాక్, 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ రూ. 5వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న ఒప్పో యూజర్లు అదనంగా రూ. 3వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

ఒప్పో ఫైండ్ X8 స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X8 ఫోన్ 6.59-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను 1,256×2,760 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఒప్పో ప్రో వేరియంట్ కొంచెం పెద్ద 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. 1,264×2,780 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. రెండు మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్-సిమ్ ఫంక్షనాలిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒప్పో కలర్ఓఎస్ 15తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతాయి.

హుడ్ కింద సిరీస్ 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో పాటు 3ఎన్ఎమ్ ప్రాసెస్‌పై నిర్మించిన మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8), 120-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ (ఎఫ్/2.0), 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.

ఒప్పో ప్రో మోడల్ క్వాడ్-కెమెరా కాన్ఫిగరేషన్‌తో కెమెరాలను అందిస్తాయి. ఇందులో 50ఎంపీ ప్రధాన సెన్సార్ (ఎఫ్/1.6), 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 6ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందించే 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ-సి ఉన్నాయి. ఒప్పో ప్రో మోడల్ అదనపు యూఎస్‌బీ 3.1 సపోర్టును అందిస్తుంది.

ఇతర ఫీచర్లలో ఐఆర్ ట్రాన్స్‌మిటర్, ఐపీ68/ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ 5,630mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఒప్పో ప్రో వెర్షన్ పెద్ద 5,910mAh యూనిట్‌ను కలిగి ఉంది. రెండూ 80డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి.

Read Also : Hero Vida V2 Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? హీరో నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!