చైనా మొబైల్ మేకర్ ఒప్పో కొత్త బ్రాండ్ రెనో నుంచి ఫస్ట్ ఫోన్ రానుంది. ఒప్పో తమ సబ్ బ్రాండ్ రెనోను చైనాలో ఆవిష్కరించింది. ఈ కొత్త బ్రాండ్ కు సంబంధించిన ‘ఐ..యామ్.. రెనో’ లోగోను ఒప్పో సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది.
చైనా మొబైల్ మేకర్ ఒప్పో కొత్త బ్రాండ్ రెనో నుంచి ఫస్ట్ ఫోన్ రానుంది. ఒప్పో తమ సబ్ బ్రాండ్ రెనోను చైనాలో ఆవిష్కరించింది. ఈ కొత్త బ్రాండ్ కు సంబంధించిన ‘ఐ..యామ్.. రెనో’ లోగోను ఒప్పో సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. అంతేకాదు.. రెనో బ్రాండ్ నుంచి ఏప్రిల్ 10న చైనాలో ఫస్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది.
రెనో లోగో ఫన్నీగా ఎంతో కలర్ ఫుల్ గా ఉండటమే కాకుండా యూత్ సెంట్రిక్ బ్రాండ్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ బ్రాండ్ పై రానున్న ఫోన్ల ధర, ఫీచర్లు యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంటాయని కంపెనీ తెలిపింది. రెనో బ్రాండ్ లోగోను ఒప్పో వైస్ ప్రెసిడెంట్ బ్రియాన్ షేన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రెనో బ్రాండ్ నుంచి రానున్న కొత్త ఫోన్ కు సంబంధించి ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. రెనో నుంచి వచ్చే కొత్త ఫోన్ లో డ్యుయల్ రియర్ కెమెరాతో కూడిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ఈ ఫోన్ లో ఇన్ డిసిప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 2.5డీ కర్వడ్ టెంపర్డ్ గ్లాస్ ఉన్నట్టు తెలుస్తోంది. 2018లో ఒప్పో తమ సబ్ బ్రాండ్ రియల్ మిని ఇండియాల్ లో లాంచ్ చేసింది.
రియల్ మి సంస్థ తాము ఒప్పో నుంచి విడిపోతున్నట్టు గత జూలైలోనే ప్రకటించింది. రియల్ మి తరహాలో ఒప్పో మరో కొత్త సబ్ బ్రాండ్ రెనోను చైనాలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒప్పో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ ఫోన్ (స్నాప్ డ్రాగన్ 855 ఎస్ఓసీ, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో కూడిన ఫోన్లను ఈ ఏడాది ఎండబ్ల్యూసీలో ప్రదర్శించింది.
Oppo Reno స్పెషిఫికేషన్లు ఇవే..
క్వాల్ కామన్ స్నాప్ డ్రాగన్ 855 SoC
ఇంటర్నల్ స్టోరేజీ 64జీబీ, 6జీబీ ర్యామ్
5జీ నెట్ వర్క్ యాక్సస్
స్నాప్ డ్రాగన్ ఎక్స్ 50, స్నాప్ డ్రాగన్ ఎక్స్ 55 5జీ మోడమ్
FHD+ QHD+ OLED డిసిప్లే
2.5D కర్వడ్ టెంపర్డ్ గ్లాస్
డ్యుయల్ కెమెరా సెటప్
10x జూమింగ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Vooc ఛార్జ్ 3.0, (60నిమిషాల్లో 100% ఛార్జింగ్)
Let’s shake things up a bit. More soon. ? #OPPOReno pic.twitter.com/ajKSc8Xmg9
— Alex MacGregor (@ajmcgr) March 11, 2019
Oppo Reno leaked from rear. Looks very similar to Vivo Apex 2019.#Oppo #Reno pic.twitter.com/RDxcsgCBit
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) March 11, 2019