Whatsapp Accounts Ban : భారతీయ యూజర్లకు భారీ షాక్.. 20లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్!

ఫేస్‌బుక్ (Meta) యాప్ వాట్సాప్.. భారతీయ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 20 లక్షల మంది వాట్సాప్ యూజర్ల అకౌంట్లపై నిషేధం విధించింది.

Whatsapp Accounts Ban : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) సొంత ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ వాట్సాప్.. భారతీయ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 20 లక్షల మంది వాట్సాప్ యూజర్ల అకౌంట్లను బ్యాన్ చేసేసింది. గత అక్టోబర్ నెలలోనే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

అక్టోబర్‌లో మొత్తం 20 లక్షల 69వేల వాట్సాప్ అకౌంట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ యూజర్ల బిహేవియర్, ఫిర్యాదుల కింద వారి అకౌంట్లపై రివ్యూ చేసి బ్యాన్ చేసినట్టు వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టినట్టు పేర్కొంది.

వాస్తవానికి ఈ గణాంకాలు సెప్టెంబర్ నాటికి చేరువైందని తెలిపింది. ప్రతినెల మాదిరిగానే అబ్యూజ్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్ యూజర్లు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి వ్యక్తిగత చాట్స్, గ్రూపుల్లో వారి ప్రవర్తనాశైలిపై వచ్చిన ఫీడ్ బ్యాక్ నివేదికలు, 500 కంప్లయింట్స్ ఆధారంగా సమీక్షించి ఆయా యూజర్ల అకౌంట్లను బ్యాన్ చేసినట్టు వాట్సాప్ స్పష్టంచేసింది.

భారతీయ యూజర్ల అకౌంట్లపై నిషేధంతో వాట్సాప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ రూల్స్‌ 2021 అమలులోకి వచ్చాక దేశీయ అకౌంట్లపై వాట్సాప్ ఫోకస్ పెడుతోంది. గ్రీవియెన్స్‌ చానెల్‌తో పాటు అనేక టూల్స్ వాడేస్తోంది. ఎక్కడా కొంచెం ఇబ్బందికరంగా అకౌంట్లు ఉన్నా వెంటనే వాటిని బ్యాన్ చేస్తోంది. కొంతమంది తమ అకౌంట్లు డిలీట్‌ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Omicron Threat..Mask Must :తెలంగాణలో మాస్క్ మస్ట్..లేదంటే..రూ. 1000 జరిమానా

ట్రెండింగ్ వార్తలు