Omicron Threat..Mask Must :తెలంగాణలో మాస్క్ మస్ట్..లేదంటే..రూ. 1000 జరిమానా

తెలంగాణలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే రూ. 1000 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒమిక్రాన్ ముప్పుతో మాస్క్ తప్పనిసరి.

Omicron Threat..Mask Must :తెలంగాణలో మాస్క్ మస్ట్..లేదంటే..రూ. 1000 జరిమానా

Omicron Threat..mask Must

Omicron Threat Mask Must : తెలంగాణలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (డిసెంబర్ 2,2021) ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే రూ. 1000 ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించింది. కరోనా వచ్చాక ప్రతీ ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అయిపోయింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ లతో ఎంతోమంది తమ ఆత్మీయుల్ని కోల్పోయారు. థర్డ్ వేవ్ హెచ్చరికలు..వచ్చినా రాకపోవటంతో జనాలు రిలాక్స్అయిపోయారు. ఇక కరోనా ఖతం అయిపోతుందని సంతోషిస్తున్నారు. ఈక్రమంలో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరింట్ ‘ఒమిక్రాన్’ వెలుగు చూసింది. దీంతో మరోసారి ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది. మాస్కులు పెట్టుకోకుండా రిలాక్స్ అయితే ముప్పు తప్పదు అన్నట్లుగా ఆయా ప్రభుత్వాలు హెచ్చరికలు జారి చేస్తున్నాయి. ఈక్రమంతో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 జరిమానా తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 12 దేశాలకు విస్తరించిందని భయపడ్డామో లేదో..12 కాదు 24 దేశాల‌కు విస్త‌రించిందనే వార్తలతో ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. మాస్క్ మస్ట్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. లేకుంటే జేబులు ఖాళీ అంటూ సంకేతాలిచ్చింది. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏళ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని తెలంగాణ ప్రజారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఇలా కరోనా పోయిందరునుకుంటుంటే మరోసారి నేనున్నానంటూ వచ్చిపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ. 1000 జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని..శానిటైజేషన్ కూడా తప్పనిసరి చేసుకోవాలని కోరారు.

Read more : Telangana : ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయ్యిందా ? మొదటి ప్రమాద హెచ్చరిక – డీహెచ్

ఒమిక్రాన్ ప్రమాదం ఎప్పుడైనా రావొచ్చు..సో బీకేర్ ఫుల్..
ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలని..తప్ప‌నిస‌రిగా కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలని సూచించారు.ఇప్పటికే 24 దేశాలల్లో ఒమిక్రాన్ గుబులు రేపుతున్న క్రమంలో బుధవారం యూకే, సింగ‌పూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 325 మంది ప్ర‌యాణికులు రాగావారిలో తెలంగాణకు చెందిన 239 మందికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేశారు. యూకే నుంచి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆమెను త‌క్ష‌ణ‌మే గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించి ఐసోలేష‌న్‌లో ఉంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఆమె నుంచి శాంపిళ్ల‌ను సేక‌రించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. అవి సాధారణ కోవిడా? లేకా ఒమిక్రానా? అనేది పరీక్షల ఫలితాలు వచ్చాకే తెలియనుంది. నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వ‌స్తేనే ఆ వైర‌స్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విష‌యం తేలుతుంది.

3 రోజుల్లోనే 24 దేశాల‌కు ఒమిక్రాన్‌ వ్యాప్తి..
ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సెకండ్ వేవ్ కంటూ ఫాస్టుగా వ్యాప్తిస్తోంది. దీని వేగం ఎంతగా ఉందంటే కేవలం 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాల‌కు విస్త‌రించింది. కాబట్టి ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్తగా ఉండాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిని ఒమిక్రాన్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.

Read more : Telangana : ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయ్యిందా ? మొదటి ప్రమాద హెచ్చరిక – డీహెచ్

మాస్కు ధ‌రించ‌డం, వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో వైర‌స్‌ను అరిక‌ట్టొచ్చు. ఫంక్ష‌న్స్, పండుగ‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ముఖ్యంగా వృద్ధులు,చిన్నపిల్లలు, గర్భిణులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాణాల‌ను కాపాడుకునే అవ‌కాశం ఉంది.

రెండు డోసులు చాలా చాలా అవసరం..
తెలంగాణ‌లో దాదాపు 25 ల‌క్ష‌ల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు డోసులు తీసుకోవ‌డం ద్వారానే పూర్తి ర‌క్ష‌ణ ల‌భించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్లు వేయించుకున్నా మాస్కులు మాత్రం తప్పనిసరి. మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. 1000 జ‌రిమానా తప్పదు.