Telangana : ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయ్యిందా ? మొదటి ప్రమాద హెచ్చరిక – డీహెచ్

వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టేనన్నారు డీహెచ్. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక అని...

Telangana : ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయ్యిందా ? మొదటి ప్రమాద హెచ్చరిక – డీహెచ్

Tg

Telangana Health Director : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయిందా..?..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వేరియంట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టిందా..? ఓ మహిళ నుంచి సేకరించిన శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ రిపోర్ట్ రాగానే ఈ విషయం నిర్ధారణ కానుంది. బ్రిటన్, సింగపూర్ సహా 11 దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 325 మందికి టెస్టులు చేశారు. అందులో.. 35 ఏళ్ల మహిళకు పాజిటివ్ రావడంతో… వేరియంట్ వ్యాప్తిపై అనుమానాలు మొదలయ్యాయి.

2021, డిసెంబర్ 01వ తేదీ బుధవారం బ్రిటన్, సింగపూర్  నుంచి వచ్చిన ప్రయాణికులకు శంషాబాద్ లో టెస్టులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆమెను గచ్చిబౌలి టిమ్స్ కు తరలించారు. శాంపిళ్లను సీసీఎంబీలో జీనోమ్ సీక్వెన్స్ కోసం తెలంగాణ వైద్య శాఖ పంపింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Omicron Variant: ఒమిక్రాన్ ప్రమాదం యువతలోనే ఎక్కువ

ప్రస్తుతం కరోనా బాధితురాలు గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల బ్రిటన్‌, సింగపూర్ నుంచి 325 మంది ప్రయాణికులు తెలంగాణకు వచ్చారని..వారందరికీ టెస్టులు నిర్వహించామని తెలిపారు హెల్త్ డైరెక్టర్. 239 మంది ప్రయాణికులు హైదరాబాద్ వారని.. మిగిలిన వారు ఇతర రాష్ట్రాల ప్రయాణికులని చెప్పారు. ఒమిక్రాన్ మూడు రోజుల్లోనే 24 దేశాలకు వ్యాపించిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ హెచ్చరించారు. భారత్‌కు ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా రావొచ్చన్నారు. ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఒమిక్రాన్ పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని డీహెచ్ తెలిపారు. క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని… రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని అన్నారు.

Read More : DH Srinivas: ఏ క్షణంలోనైనా భారత్‌లోకి ఒమిక్రాన్ రావచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టేనన్నారు డీహెచ్. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక అని…గతంలో కంటే కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా నిబంధనను కచ్చితంగా పాటిస్తామన్నారు. ప్రయాణాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. టీకా తీసుకున్నారా లేదా అన్నదానిపై గురువారం నుంచి హెల్త్ సిబ్బంది చెక్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో 90శాతం మొదటి డోస్ తీసుకున్నారని…25లక్షల మంది రెండో డోస్ తీసుకోలేదని డీహెచ్ వివరించారు.