Omicron Variant: ఒమిక్రాన్ ప్రమాదం యువతలోనే ఎక్కువ

దక్షిణాఫ్రికా పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచదేశాలకు విస్తరించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వేరియంట్‌పై సైంటిస్టులు జరుపుతున్న పరిశోధనకు.

Omicron Variant: ఒమిక్రాన్ ప్రమాదం యువతలోనే ఎక్కువ

Omicron

Omicron Variant: దక్షిణాఫ్రికా పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచదేశాలకు విస్తరించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వేరియంట్‌పై సైంటిస్టులు జరుపుతున్న పరిశోధనకు అంతుచిక్కడం లేదు. దీని గురించి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు మ్యూటేషన్లు మరింత ప్రమాదకరంగా మారనున్నాయని వారించినా పట్టించుకోవడం లేదు.

తాజాగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు సైతం ఇదే వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కష్టతరంగా ఉందని వెల్లడించారు.

‘ప్రస్తుతం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా యువతకే సోకుతోంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో తీవ్రత బయటకు కనిపించడం లేదు. ఈ వైరస్‌ పెద్దవారిలోనూ కనిపిస్తుంది. వారిలో తీవ్రమైన సమస్యలు కొన్ని వారాల వరకు కనిపించకపోవచ్చు’ అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు.

………………………………………. : ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యగమనిక

శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. మ్యూటేషన్‌ ప్రొఫైల్‌, వైరస్‌ స్వరూపాన్ని పరిశీలించగా.. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతున్నట్లు తేలింది. కొవిడ్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఒమిక్రాన్‌ నుంచి తప్పక రక్షణ లభిస్తుందని తెలిసింది.