PAN Card : మీ పిల్లలకు పాన్ కార్డు తీసుకున్నారా? ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో..!

PAN Card : పిల్లల కోసం పాన్ కార్డు కావాలా? ఇలా సింపుల్‌గా అప్లయ్ చేసుకోండి. మీరు చేయాల్సిందిల్లా ఈ సింపుల్ ప్రాసెస్ మాత్రమే..

Pan Card Apply

PAN Card : మీ పిల్లలకు పాన్ కార్డు ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోవచ్చు. అదేంటి.. పిల్లలకు పాన్ కార్డు ఏంటి? అనుకుంటున్నారా? పెద్దలే కాదు.. పిల్లలు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. చాలామంది ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వారికి మాత్రమే పాన్ కార్డు అవసరమని అనుకుంటారు.

Read Also : OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 13పై బిగ్ డిస్కౌంట్.. తక్కువ ధరలో ఇలా కొనేసుకోండి!

కానీ, పాన్ కార్డులు పిల్లల కోసం కూడా అప్లయ్ చేసుకునేందుకు వీలుంది. దీన్నే మైనర్ పాన్ కార్డ్ అంటారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, టీనేజర్ల కోసం జారీ అవుతుంది.

నివేదికల ప్రకారం.. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు పిల్లల బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయడం లేదా వారి పేరు మీద ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు కూడా పాన్ కార్డు తీసుకోవాలి.

పిల్లల పాన్ కార్డులో ఫోటో ఉండదు. సంతకాలు కూడా చేయరు. బిడ్డకు 18 ఏళ్లు నిండినప్పుడు అదే పాన్ కార్డు అప్‌గ్రేడ్ అవుతుంది. మీ బిడ్డ కోసం పాన్ కార్డు అప్లయ్ చేయాలనుకుంటే ఈ పని ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పిల్లల పాన్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలి? :

  • మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ విజిట్ చేయడం ద్వారా NSDL వెబ్‌సైట్‌ను కనుగొనండి.
  • మీరు సెలెక్ట్ అప్లికేషన్ కేటగిరీకి వెళ్లి వ్యక్తిగత ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తరువాత, పిల్లల పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి.
  • మీరు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వివరాలను సమర్పించాలి.
  • వివరాలను సమర్పించిన తర్వాత మీకు టోకెన్ నంబర్ వస్తుంది.
  • మీరు ‘పాన్ దరఖాస్తు ఫారమ్‌తో Continue’పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ వివరాలను లింక్ చేయాలి.
  • తల్లిదండ్రుల వివరాలు, ఆదాయ సమాచారాన్ని అందించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా, అవసరమైన రుసుములు చెల్లించాలి.
  • రాబోయే 15 రోజుల్లోపు పాన్ కార్డ్ మీ అడ్రస్‌కు డెలివరీ అవుతుంది.
  • పాన్ కార్డ్ రెడీ అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • పిల్లలు పాన్ కార్డు కోసం సొంతంగా అప్లయ్ చేయలేరు.
  • మొత్తం ప్రక్రియ తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే జరుగుతుంది.

పిల్లల కోసం పాన్ కార్డ్ తీసుకోవాలంటే.. ప్రధానంగా గుర్తింపు రుజువు, వయస్సు రుజువు, అడ్రస్ ప్రూఫ్ అవసరం. ఐడెంటిటీ ప్రూఫ్‌లో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ మొదలైనవి ఉన్నాయి.

ఆధార్ కార్డును కూడా ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా కూడా ఇవ్వవచ్చు. మీకు కావాలంటే నివాస ధృవీకరణ పత్రాన్ని యాడ్ చేయొచ్చు. జనన ధృవీకరణ పత్రం అడిగితే అది కూడా ఇవ్వొచ్చు. పాన్ కార్డు కోసం పెద్దగా ఖర్చు ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే దాదాపు 101 రూపాయలకే పని పూర్తవుతుంది.

Read Also : iQOO Neo 10 Price : ఐక్యూ నియో 10 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవేనా?

చాలా మంది సమీపంలోని సైబర్ కేఫ్ లేదా జన సేవా కేంద్రానికి వెళ్లి కూడా ఈ పని పూర్తి చేయొచ్చు. దాదాపు రూ. 200కు పని పూర్తవుతుంది. దరఖాస్తు సమర్పించిన దాదాపు 15 రోజుల్లోపు పాన్ కార్డు మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ అవుతుంది.