PhonePe Income Tax Payment : ఫోన్‌పే‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై, మీ ఆదాయ పన్నును నేరుగా యాప్ నుంచే చెల్లించవచ్చు..!

PhonePe Income Tax Payment : ఫోన్‌పే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్నును నేరుగా యాప్ నుంచి నేరుగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది.

PhonePe Income Tax Payment : ఫోన్‌పే‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై, మీ ఆదాయ పన్నును నేరుగా యాప్ నుంచే చెల్లించవచ్చు..!

PhonePe introduces Income Tax Payment feature, allowing users to pay tax directly from app

Updated On : July 24, 2023 / 7:58 PM IST

PhonePe Income Tax Payment : ఆదాయపు పన్నుచెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో తమ వార్షిక ఆదాయానికి సంబంధించి రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేసేందుకు జూలై 31 చివరి తేదీ. అయితే, ఇటీవలే ITR ఫైల్ చేయడానికి గడువు పొడిగించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పన్ను చెల్లింపులో భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ (PhonePe) యాప్‌లో ‘ఆదాయ పన్ను చెల్లింపు’ (Income Tax Payment) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు, వ్యక్తులు, వ్యాపారులు తమ ఫోన్‌పే యాప్‌లో నేరుగా సెల్ఫ్-అసెస్‌మెంట్, ముందస్తు పన్ను చెల్లించడానికి అనుమతిస్తుంది. ఫోన్‌పే ద్వారా పేర్కొన్న విధంగా పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ పోర్టల్‌కి లాగిన్ చేయవలసిన అవసరం లేదు. ఫోన్‌పే యాప్‌లోనే ఈ ఫీచర్‌ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పే సంస్థ PayMate, డిజిటల్ B2B పేమెంట్స్, సర్వీస్ ప్రొవైడర్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.

Read Also : Apple Retail Stores : ఆపిల్ కొత్త రిటైల్ స్టోర్ సర్వీసు.. కస్టమర్లకు ఇకపై ఈజీగా హోం డెలివరీ.. ఎప్పటినుంచంటే?

ఫోన్‌పే పన్నుచెల్లింపుదారుల కోసం లేటెస్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ లేదా UPIని ఉపయోగించి సౌకర్యవంతంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ల కోసం అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. ఎందుకంటే వినియోగదారులు 45 రోజుల వడ్డీ రహిత వ్యవధిని పొందవచ్చు.

తమ సంబంధిత బ్యాంకుల ఆధారంగా వారి పన్ను చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను కూడా పొందవచ్చు. ముఖ్యంగా, ఈ కొత్త PhonePe ఫీచర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు పన్నును మాత్రమే చెల్లించగలరు. కానీ, ఫైల్ చేయలేరని గమనించాలి. ITR ఫైల్ చేయడానికి వినియోగదారులు ఇప్పటికీ ఇచ్చిన వివరాలను ఫాలో చేయాల్సి ఉంటుంది.

PhonePe introduces Income Tax Payment feature, allowing users to pay tax directly from app

PhonePe introduces Income Tax Payment feature, allowing users to pay tax directly from app

ఫోన్‌పే‌లో ఆదాయపు పన్ను ఎలా చెల్లించాలంటే?:
ఫోన్‌పే యాప్‌లో కేవలం 3 సాధారణ దశల్లో యూజర్లు తమ పన్నులను ఎలా చెల్లించవచ్చునో ఇప్పుడు చూద్దాం..

* మీ iPhone లేదా Android స్మార్ట్‌ఫోన్‌లో PhonePe యాప్‌ని ఓపెన్ చేయండి.
* హోమ్‌పేజీలో కనుగొని, ‘ఆదాయ పన్ను’ ఐకాన్‌పై నొక్కండి.
* ఆ తర్వాత, మీరు పేమెంట్ ట్యాక్స్ టైప్, అసెస్‌మెంట్ సంవత్సరం, పాన్ కార్డ్ వివరాలను ఎంచుకోవాలి.
* మొత్తం పన్ను మొత్తాన్ని ఎంటర్ చేసి మీకు అవసరమైన పేమెంట్ మెథడ్ ఎంచుకోండి.
* పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మొత్తం 2 పని దినాలలో పన్ను పోర్టల్‌కు క్రెడిట్ అవుతుంది.

చెల్లింపు తర్వాత.. పన్ను చెల్లింపుదారులు సింగిల్ వర్కింగ్ డే లోపు ప్రత్యేక లావాదేవీ సూచన (UTR) నంబర్ రూపంలో ఇన్‌స్టంట్ రసీదుని స్వీకరిస్తారని ఫోన్‌పే పేర్కొంది. ఇంకా, పన్ను చెల్లింపు చలాన్ యూజర్లకు టూ వర్కింగ్ డేస్‌లో అందుబాటులో ఉంటుంది.

Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరే అప్‌డేట్.. 5 సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఇవే..!