Pixel 7 vs Pixel 6a Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 5G ఫోన్లపై రూ. 10వేల లోపు డిస్కౌంట్.. ఏ ఫోన్ కొంటే బెటర్? పూర్తి వివరాలు మీకోసం..!

Pixel 7 vs Pixel 6a Discount : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో Pixel 7, Pixel 6a 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట సేల్ ఈవెంట్ అందుబాటులో లేదు.

Pixel 7 vs Pixel 6a Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 5G ఫోన్లపై రూ. 10వేల లోపు డిస్కౌంట్.. ఏ ఫోన్ కొంటే బెటర్? పూర్తి వివరాలు మీకోసం..!

Pixel 7 and Pixel 6a are available with massive discount on Flipkart, check out details

Updated On : February 27, 2023 / 10:42 PM IST

Pixel 7 vs Pixel 6a Discount : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో Pixel 7, Pixel 6a 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట సేల్ ఈవెంట్ అందుబాటులో లేదు. కానీ, 5G డివైజ్‌లపై గరిష్టంగా రూ.10వేల తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. Pixel 6a, Pixel 7 మార్కెట్లో అత్యుత్తమ కెమెరా ఫోన్‌లుగా అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజ్‌లలో దేనినైనా కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. ఈ రెండు పిక్సెల్ ఫోన్లలో ఏ ఫోన్ తక్కువ ధరకు అందుబాటులో ఉందో ఓసారి చూద్దాం..

Pixel 6a, Pixel 7 డిస్కౌంట్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a 128GB స్టోరేజ్ మోడల్ రూ. 29,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ గత ఏడాదిలో రూ. 40వేల కన్నా ఎక్కువ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 59,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో Pixel 7 రూ. 57,099 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. కాబట్టి, వినియోగదారులు ఈ 5G ఫోన్‌పై దాదాపు రూ.3వేల తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, SBI, HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.7,000 తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. అంటే.. డిస్కౌంట్ తర్వాత పిక్సెల్ 5G ఫోన్ ధర రూ.50,099కి తగ్గింది.

Pixel 7 and Pixel 6a are available with massive discount on Flipkart, check out details

Pixel 7 and Pixel 6a are available with massive discount on Flipkart

Read Also : 2023 Hyundai Alcazar Booking : కొత్త ఇంజిన్‌తో హ్యుందాయ్ అల్కాజార్ కారు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Pixel 6a సరసమైన ధరలో అద్భుతమైన ఫోటోగ్రఫీ కెమెరాలను కలిగి ఉంది. Pixel 6aని ఉపయోగించి పోర్ట్రెయిట్ షాట్‌లను క్లిక్ చేయొచ్చు. బ్లర్ ఎఫెక్ట్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. Google మ్యాజిక్ ఎరేజర్ టూల్ నిజంగా బాగుంది. ఫొటోను క్లిక్ చేసిన తర్వాత ఫ్రేమ్‌లోని అనవసరమైన వాటిని తొలగిస్తుంది. రూ. 30వేల లోపు కొన్ని ప్రముఖ మిడ్-రేంజ్ ఫోన్‌ల కన్నా తక్కువ-కాంతిలో మెరుగైన ఫొటోలను తీయగలదు.

Pixel 6a 6.14-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. పూర్తి HD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. కేవలం 60Hz డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంది. హై-ఎండ్ కంటెంట్ వ్యూ ఎక్స్ పీరియన్స్ Google HDR 10+కి సపోర్టును యాడ్ చేసింది. 5G ఫోన్ సాధారణ పనితీరు బాగుంది. Pixel 6a 4,410mAh బ్యాటరీని కలిగి ఉంది. హార్డ్-కోర్ యూజర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ తరచుగా డివైజ్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

Google రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించదని గమనించాలి. మీరు వేరుగా కొనుగోలు చేయాలి. కంపెనీ కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. Pixel 7 స్లో ఛార్జింగ్ (20W)కి సపోర్టు ఇస్తుంది. స్పీకర్లు బాగానే ఉన్నాయి. హెడ్‌ఫోన్ జాక్ లేదు. భారత మార్కెట్‌లోని చాలా ప్రీమియం ఫోన్‌లలో ఇలాంటిది లేదు. కంపెనీ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. మీరే విడిగా బయట కొనుగోలు చేయవలసి ఉంటుంది. పిక్సెల్ 7 IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అదనపు బోనస్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అధికంగా ఫోన్ వినియోగిస్తే,, రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

Read Also : 2023 Tata Safari ADAS : 2023 టాటా సఫారి ADAS కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ కారు కొనాల్సిందే..!