Pixel 7 and Pixel 7 Pro are launching in India, confirms Google
Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) రాబోయే పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. Pixel 7 సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ Pixel 7, Pixel 7 Pro అక్టోబర్ 6న భారత మార్కెట్లో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ధృవీకరించింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart లిస్టులో పిక్సెల్ ఈ రెండు డివైజ్‌లను లిస్టు చేయనుంది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు Google ధృవీకరించింది. పిక్సెల్ 7 (Pixel 7), (Pixel 7 Pro) రెండూ త్వరలో భారత మార్కెట్లో రానున్నాయి.
అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. భారత్ మార్కెట్లో గూగుల్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. పిక్సెల్ 7 సిరీస్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేయనుందో గూగుల్ ధృవీకరించలేదు. కానీ, ఫ్లిప్‌కార్ట్ లిస్టును పరిశీలిస్తే.. పిక్సెల్ ఫ్యాన్స్, కెమెరా ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
Pixel 7 and Pixel 7 Pro are launching in India, confirms Google
భారతీయ మార్కెట్లో చివరి ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ డివైజ్‌లు పిక్సెల్ 3 (Pixel 3), పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ (Pixel 3XL). గత ఏడాదిలో పిక్సెల్ 6 సిరీస్ (Pixel 6 Series)తో సహా అన్ని ఫోన్‌లు భారతీయ మార్కెట్లోకి అందుబాటులో రాలేదు. కానీ, ఈ ఏడాదిలో ఆ పరిస్థితులు మారబోతున్నట్లు కనిపిస్తోంది. భారతీయులు 2018 తర్వాత కొత్త ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్‌ను చూడబోతున్నారు.
ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Sale) పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series) బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) పేజీలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించింది. కానీ, Pixel 7 ఇండియా లాంచ్ పేజీకి సంబంధించిన లింక్ ఇప్పటికీ లైవ్‌లో ఉంది. ఈ కింది స్క్రీన్‌షాట్‌ని చెక్ చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ ఫోన్‌లను భారత మార్కెట్లోకి రెగ్యులర్‌గా తీసుకురావడం లేదు. గత కొన్ని ఏళ్లుగా భారత్ మార్కెట్లో కొన్ని సరసమైన పిక్సెల్ ఫోన్‌లను మాత్రమే లాంచ్ చేసింది. అందులో లేటెస్ట్ Pixel 6a ఉంది. ఇప్పుడు, పిక్సెల్ 7 సిరీస్ భారత మార్కెట్లోకి వస్తే.. ఐఫోన్ 14 మోడల్‌లు, శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్‌లకు పోటీగా ఉంటుంది.
Pixel 7 and Pixel 7 Pro are launching in India, confirms Google
రాబోయే పిక్సెల్ 7 సిరీస్ డిజైన్‌ను గూగుల్ అధికారికంగా వెల్లడించింది. రెండు ఫోన్‌లు పిక్సెల్ 6 సిరీస్‌కు సమానమైన డిజైన్‌తో వస్తాయని తెలిపింది. పిక్సెల్ 7 సిరీస్ ఈసారి కొన్ని కొత్త కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు. ఈ ఏడాదిలో పిక్సెల్ ఫోన్‌లు కంపెనీ లేటెస్ట్ టెన్సర్ చిప్ (టెన్సర్ G2)తో వస్తాయని భావిస్తున్నారు.
గూగుల్ అధికారికంగా పిక్సెల్ 7 సిరీస్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దేశంలో పిక్సెల్ 4 సిరీస్ నుంచి ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్‌ల లాంచ్‌ను కంపెనీ నిలిపివేసింది. ఎందుకంటే.. సోలి రాడార్ హార్డ్‌వేర్ దేశంలో మార్గదర్శకాలకు అనుగుణంగా లేదనే చెప్పాలి. భారత మార్కెట్లో పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ గూగుల్ అధికారికంగా ధృవీకరించేవరకు వేచి చూడాల్సిందే.