Pixel 7a Price Leak : కొన్ని గంటల్లో పిక్సెల్ 7a లాంచ్.. అంతలోనే ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Pixel 7a Price Leak : గూగుల్ IO ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7a సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే పిక్సెల్ 7a ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Pixel 7a India Price leaked hours ahead of formal launch at Google IO Event

Pixel 7a Price Leak : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (Google Pixel 7a)ను ఈరోజు రాత్రి (మే 10)న జరగనున్న (Google I/O) ఈవెంట్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. మరికొద్ది గంటల్లో పిక్సెల్ ఫోన్ రివీల్ చేయనుంది. ఇంతలోనే పిక్సెల్ 7a సిరీస్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనిపై, గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7a ఫోన్ బ్యానర్‌ ప్రత్యక్షమైంది. పిక్సెల్ 7a భారత మార్కెట్లో ధర, బ్యాంక్ ఆఫర్‌లను రివీల్ చేసింది.

భారత్‌లో Pixel 6a ఫోన్‌కు ఫుల్ రెస్పాన్స్ రావడతో Pixel 7a కూడా రిలీజ్ చేసేందుకు గూగుల్ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. అధికారిక లాంచ్ సమయానికి పిక్సెల్ 7a ఫోన్ ధర లీక్ అయింది. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బ్యానర్‌ను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేశారు. పిక్సెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Pixel 7a ధరను తెలిసిపోయింది. ఈ ఫోన్ ధర రూ. 39,999కి అందుబాటులో ఉంటుందని బ్యానర్ సూచిస్తుంది. ఇతర ఫోన్లపై అంచనా ధర కన్నా చాలా తక్కువగా ఉంది.

Read Also : TCL 4K QLED TV : కొత్త టీవీ కొంటున్నారా? టీసీఎల్ నుంచి కొత్త 4K QLED టీవీ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

అయితే, Pixel 7a ఫోన్ ధర తగ్గింపు బ్యాంక్ ఆఫర్‌ ద్వారా మాత్రమే పొందవచ్చు. Pixel 7a అసలు ధర రూ. 43,999 అని టిప్‌స్టర్‌లు వెల్లడించాయి. HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ. 4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ పిక్సెల్ 7a ఫోన్ రూ. 39,999 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Pixel 7a India Price leaked hours ahead of formal launch at Google IO Event

రూ. 40వేల ధరలో వన్‌ప్లస్ 11R ఫోన్ :
భారత మార్కెట్లో గూగుల్ Pixel 6a కూడా రూ. 43,999 వద్ద లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డివైజ్ రూ. 39,999కు విక్రయించింది. జరిగింది. పిక్సెల్ 6a ధర వెంటనే రిటైల్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ స్టోర్‌లలో భారీగా తగ్గింది. ఈ డివైజ్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 27,999కి అందుబాటులో ఉంది. Pixel 7a ఫోన్ అధికారిక ధరను గూగుల్ ఇంకా నిర్ధారించలేదు. లీక్‌స్టర్ల ప్రకారం.. ఇతర స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు ఆందోళన చెందక తప్పదు. ఎందుకంటే.. ప్రస్తుతం మార్కెట్లో OnePlus 11R రూ.40వేల ధరలో అందుబాటులో ఉంది. అయితే, Pixel 7a దాదాపు అదే ధర వద్ద వచ్చినట్లయితే OnePlus 11R ఫోన్ కొనుగోలుపై ప్రభావం పడొచ్చు. Pixel 7a పిక్సెల్ 7 మాదిరిగా అదే డిజైన్‌‌తో వచ్చే అవకాశం ఉంది.

Pixel 7a ఫోన్ 6.1-అంగుళాల FHC+ 90hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్‌తో రానుంది. ఈ ఫోన్ G2 చిప్‌సెట్ ద్వారా రానుంది. ముఖ్యంగా, టెన్సర్ G2 చిప్‌సెట్.. ప్రస్తుతం పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలో కూడా ఉంది. కెమెరా విషయానికొస్తే.. Pixel 7a బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64MP సోనీ IMX787 సెన్సార్‌తో పాటు 12-MP సెన్సార్ ఉండవచ్చు. ఫ్రంట్ కెమెరా స్పెక్స్ ఇంకా బయటకు రాలేదు. కానీ, పిక్సెల్ 7a ఫోన్ 10.8-MP లెన్స్‌ను పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో మాదిరిగానే ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Twitter New Features : ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీ మెసేజ్‌లకు ఇక ఫుల్ ప్రొటెక్షన్.. ఎలన్ మస్క్ కూడా మీ మెసేజ్ చదవలేడు..!