Google Pixel 8 India launch after 4 days, here is how much they may cost
Google Pixel 8 India Launch : పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోతో సహా పిక్సెల్ 8 సిరీస్ లాంచ్ చేసేందుకు గూగుల్ రెడీ అవుతోంది. లీక్ అయిన అమెరికా ధరల ఆధారంగా భారత మార్కెట్లో పిక్సెల్ 8 సిరీస్ ధర (Google Pixel 8 Series Price) ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్‌లు అక్టోబర్ 4 లాంచ్ తేదీన ఎలా ఉండబోతున్నాయి అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
రుమర్ల ప్రకారం.. పిక్సెల్ 8 సిరీస్ (Pixel 8 Series) ధర 699 డాలర్ల వద్ద లాంచ్ చేసే వీలుంది. అయితే, పిక్సెల్ 8 ప్రో 999 డాలర్ల ధర వద్ద లాంచ్ కావచ్చు. పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ ధరల కన్నా 100 డాలర్ల ధరల పెరుగుదలను సూచిస్తుంది. Pixel 8, Pixel 8 Pro భారతీయ ధరలపై అనేక అంచనాలు నెలకొన్నాయి.
భారత్‌లో పిక్సెల్ 8 సిరీస్ ధర పెరిగే అవకాశం :
ఇటీవల (9to5Google) నివేదిక ప్రకారం.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో 699డాలర్లు, 999 డాలర్లు వద్ద లాంచ్ కావచ్చనని నివేదిక సూచించింది. అంటే.. వరుసగా భారత కరెన్సీలో రూ. 58,000, రూ. 82,900 ధరకు రావచ్చు. ఇప్పుడు, భారత మార్కెట్లో పిక్సెల్ 8 సిరీస్‌కి ఈ రకమైన ధర చాలా తక్కువగా ఉంది.
Google Pixel 8 India launch Offers
పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ 100 డాలర్ల ధరను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను పరిగణనలోకి తీసుకుంటే.. భారత లాంచ్ ధరలు పిక్సెల్ 8 సిరీస్ ధర రూ. 59,999, రూ. 84,999 వరుసగా ఉండవచ్చు. భారత్‌లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు, స్టాండర్డ్ పిక్సెల్ 8 ధర రూ. 65వేల నుంచి రూ. 70వేల వరకు ఉండవచ్చు. అయితే, పిక్సెల్ 8 ప్రో ధర రూ. 90వేల నుంచి రూ. 95వేల మధ్య ఉండవచ్చు.
కానీ, పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా మరో డివైజ్ భారత మార్కెట్లో లాంచ్ కానుందని అధికారికంగా ధృవీకరించింది. గూగుల్ పిక్సెల్ వాచ్ (Google Pixel Watch) ఫస్ట్ జనరేషన్ గత ఏడాదిలో పిక్సెల్ వాచ్ 2 మోడల్ 349 డాలర్ల ప్రారంభ ధరతో చేసింది. అయితే, పిక్సెల్ వాచ్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయలేదు. కానీ, సెకండ్ జనరేషన్ పిక్సెల్ వాచ్ 2 భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాది మాదిరిగానే ఉండవచ్చు. 349 డాలర్లు అంటే.. సుమారు రూ. 29వేలు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.