Pixel 8 Series Launch : భలే ఉందిగా బ్రో.. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వచ్చేసిందోచ్.. పిక్సెల్ వాచ్ 2 కూడా కొనేసుకోండి.. ధర ఎంతో తెలుసా?
Pixel 8 Series Launch : మేడ్ బై గూగుల్ ఈవెంట్ (Made by Google Event)లో టెక్నాలజీ దిగ్గజం పిక్సెల్ 8 సిరీస్ ఫోన్‌లు, పిక్సెల్ వాచ్ 2 (Pixel Watch 2) అధునాతన ఫీచర్‌లతో ఇతర గాడ్జెట్‌ల కొత్త వెర్షన్‌లను లాంచ్ చేసింది.

Pixel 8 Series And Pixel Watch 2 Launched during Made by Google Event in Telugu
Pixel 8 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ‘మేడ్ బై గూగుల్‘ (Made by Google Event) ఈవెంట్‌లో పిక్సెల్ 8 (Pixel 8 Series), పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro), పిక్సెల్ వాచ్ 2 లాంచ్ (Pixel Watch 2 Launch) అయినట్లు గూగుల్ ప్రకటించింది. లేటెస్ట్ పిక్సెల్ ఫోన్‌లు సేఫ్ ఫేస్ అథెంటికేషన్ వంటి అనేక కొత్త ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ పిక్సెల్ ఫోన్‌ల కొత్త అంశం ఏమిటంటే.. 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్టుతో వస్తున్నాయి.
ఇంటర్నల్ థర్మామీటర్‌తో కూడా వస్తాయి. సెకండ్ జనరేషన్ పిక్సెల్ వాచ్ కొన్ని అద్భుతమైన అప్‌గ్రేడ్ ఆప్షన్లను కలిగి ఉంది. గూగుల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (Pixel Buds Pro) సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంటుంది. గూగుల్ బార్డ్ లార్జ్ (Google Bard AI Large) లాంగ్వేజ్ మోడల్‌ని ఉపయోగించి గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)ని మెరుగుపరచడానికి ప్లాన్లను ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (artificial intelligence)తో రన్ అయ్యే అధునాతన సంభాషణ సామర్థ్యాలను అందిస్తుంది.
Google Pixel 8 Series :
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అనేది 6.2-అంగుళాల OLED డిస్‌ప్లేతో కూడిన కాంపాక్ట్ ఫోన్. శక్తివంతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది. 2,000 నిట్‌ల వరకు చేరుకుంటుంది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. పిక్సెల్ 8 సిరీస్ గూగుల్ లేటెస్ట్ టెన్సర్ G3 చిప్‌సెట్, వేగవంతమైన, సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. మీ ఫైల్‌లను వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 8 నిరాశపరచదు. అద్భుతమైన తక్కువ-కాంతిలోనూ పర్ఫార్మెన్స్ బాగుంటుంది.

Pixel 8 And Google Pixel 8 Pro Series Sale
అధునాతన ఆక్టా-PD టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 8x సూపర్-రెస్ డిజిటల్ జూమ్‌ను పొందవచ్చు. క్లోజప్ షాట్‌ల కోసం ఆటో ఫోకస్, మాక్రో సామర్థ్యాలతో 12MP సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. ఫ్రంట్ కెమెరా 10.5MP షూటర్ కలిగి ఉంది. హుడ్ కింద.. పిక్సెల్ 8 సిరీస్ 4,575mAh బ్యాటరీని అందిస్తుంది. రోజంతా ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. 27W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అయినప్పటికీ గూగుల్ ఇటీవలి విధానానికి అనుగుణంగా రిటైల్ ప్యాకేజీలో ఛార్జర్ అందించడం లేదు.
Google Pixel 8 Pro :
పిక్సెల్ 8 ప్రో మోడల్ 6.7-అంగుళాల QHD+ OLED డిస్‌ప్లేతో అద్భుతమైన విజువల్స్, అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ శక్తివంతమైన 3 కెమెరాలు ఉన్నాయి. ఫేజ్-డిటెక్ట్ ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, కొత్త 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 48MP ఆకట్టుకునే 30X సూపర్-రెస్ డిజిటల్ జూమ్‌తో 5x జూమ్ కెమెరా, ఫోన్ డిజైన్ గ్లాస్, మెటల్‌ను అందిస్తుంది. మునుపటి పిక్సెల్ 7 ప్రోని గుర్తు చేస్తుంది.
అత్యాధునిక ఫీచర్లు.. టెంపరేచర్ సెన్సార్లు :
ఇందులో (Google Tensor G3) చిప్‌లో రన్ అవుతుంది. పిక్సెల్ 8 ప్రో మోడల్ 5,050mAh బ్యాటరీని అందిస్తుంది. 30W వైర్డు ఛార్జింగ్, 23W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అయినప్పటికీ ఛార్జర్ అందించడం లేదు. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో మెరుగైన భద్రతకు టైటాన్ సెక్యూరిటీ చిప్, 12GB RAM, మృదువైన మల్టీ టాస్కింగ్, విశాలమైన స్టోరేజీ కోసం 256GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. టెంపరేచర్ మానిటరింగ్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ప్రత్యేకమైన అదనంగా స్కిన్ టెంపరేచర్ సెన్సార్, Melexis MLX90632 యూనిట్, కెమెరాల దగ్గర ఉన్నాయి. ఇతర సెన్సార్‌ల మాదిరిగా కాకుండా, కచ్చితమైన టెంపరేచర్ రీడింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

Pixel 8 Series Launched Made by Google Event
పిక్సెల్ 8 సిరీస్ భారత్ లాంచ్ ధర ఎంతంటే? :
పిక్సెల్ 8 సిరీస్ 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో (128GB, 256GB) లభిస్తుంది. అందులో 128GB వేరియంట్ ధర రూ. 75,999 కాగా, 256GB వేరియంట్ రూ. 82,999కి లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్ విండో ఇప్పుడు ఓపెన్ అయింది. ఆసక్తి గల వినియోగదారులు పిక్సెల్ 8 ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సేల్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ.8వేల తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.
Google Pixel Watch 2 :
గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన పిక్సెల్ వాచ్ 2 (Google Pixel Watch 2 Sale)ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. గత వాచ్ వెర్షన్‌తో పోలిస్తే డిజైన్, యాక్టివిటీ రెండింటిలోనూ కొన్ని అద్భుతమైన అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. పిక్సెల్ వాచ్ 2 ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో రూపొందించింది. పర్యావరణ అనుకూలతను మాత్రమే కాకుండా గత మోడల్ కన్నా 10శాతం తేలికగా ఉంటుంది. వాచ్‌లో పెద్ద క్రౌన్ కూడా ఉంటుంది. హుడ్ కింద, సున్నితమైన కొత్త క్వాడ్-కోర్ CPU ద్వారా అందిస్తుంది. తక్కువ-పవర్ కో-ప్రాసెసర్ ద్వారా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు.. 24-గంటల బ్యాటరీ లైఫ్, అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌లలో ఒకటి. అదనంగా, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది, కేవలం 30 నిమిషాల్లో 50శాతం బ్యాటరీని అందిస్తుంది.

Pixel 8 Series And Pixel Watch 2 Launched
సరికొత్త హెల్త్ ఫీచర్లు.. 3 కొత్త సెన్సార్లు :
పిక్సెల్ వాచ్ 2 మోడల్ 3 కొత్త సెన్సార్‌లను కలిగి ఉంది. అప్‌గ్రేడ్ ఫీచర్లలో హార్ట్ రేట్ సెన్సార్, మల్టీ LEDలతో అమర్చారు. వ్యాయామాల సమయంలో కూడా అత్యంత కచ్చితమైన రీడింగ్‌లను అందిస్తుంది. ఫిట్‌బిట్ బాడీ రెస్పాన్స్ ఫీచర్, నిరంతర ఎలక్ట్రోడెర్మల్ యాక్టివిటీ (CEDA) సెన్సార్‌ని ఉపయోగించి, మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించగలదు.
వినియోగదారులకు మార్గదర్శకాన్ని అందిస్తుంది. అదనంగా, నిద్ర విధానాలను, మొత్తం ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి రాత్రిపూట స్కిన్ టెంపరేచర్‌ను మానిటరింగ్ చేయగలదు. (Wear OS 4)తో, పిక్సెల్ వాచ్ 2 కస్టమైజడ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇందులో నోటిఫికేషన్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. జీమెయిల్, క్యాలెండర్ వంటి కొత్త యాప్‌లను కూడా కలిగి ఉంది.