POCO C65 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 7,499 ధరకే పోకో సి65 ఫోన్ కొనేసుకోండి..!
POCO C65 Launch in India : భారత్‌లో పోకో సి65 బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్, ఆకట్టుకునే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్పెక్స్, ధర, లభ్యత వివరాలను ఓసారి లుక్కేయండి.

POCO C65 launched in India with MediaTek Helio G85 chipset_ Check price, specs, and more
POCO C65 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త పోకో స్మార్ట్‌ఫోన్ సి65 వచ్చేసింది. పోకో సి65 భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.10వేల కన్నా తక్కువ ధర వద్ద భారతీయ మార్కెట్‌కు చేరింది. పోకో సి65 బలమైన మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. పోకో సి65 ఆకట్టుకునే పనితీరును అందిస్తుంది. సొగసైన, డిజైన్, నాచ్-ఫ్రీ వాటర్-డ్రాప్ డిజైన్‌ను కలిగి ఉంది. అద్భుతమైన 6.74-అంగుళాల హెచ్‌డీ+ 90హెచ్‌జెడ్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
పోకో సి65 స్పెసిఫికేషన్‌లు :
పోకో సి65 స్మార్ట్‌ఫోన్ సౌకర్యవంతమైన ఫీచర్లతో 168మీమీ x 78మీమీ x 8.09మీమీ, బరువు 192గ్రాములు ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ అదనపు భద్రతను అందిస్తుంది. స్టోరేజీ పరంగా పోకో సి65 మల్టీఫేస్ ఆప్షన్లను అందిస్తుంది. 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ 8జీబీ+256జీబీ కూడా ఉన్నాయి.
రెండు నానో సిమ్ కార్డ్‌లు, మైక్రో ఎస్‌డీ కార్డ్ ప్రత్యేక స్లాట్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు భారీ 1టీబీ వరకు స్టోరేజీని విస్తరించవచ్చు. విస్తృతమైన స్టోరేజ్ ఆప్షన్‌లు అవసరమయ్యే వారికి అందిస్తుంది. ఈ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్ జెడ్‌టచ్ శాంప్లింగ్ రేట్‌తో నాచ్-ఫ్రీ 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన స్క్రోలింగ్, వేగవంతమైన టచ్ అందిస్తుంది.
మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌తో రన్ అవుతున్న పోకో సి65 టాస్క్‌లను సజావుగా నిర్వహిస్తుంది. శక్తివంతమైన జీపీయూ వేగవంతమైన ప్రాసెసింగ్ కలిగి ఉంది. గేమింగ్ కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది.

POCO C65 launched in India
8ఎంపీ ఫ్రంట్ కెమెరా మెరుగైన ఫొటో క్వాలిటీకి ఫిల్టర్‌లు, నైట్ మోడ్, ఏఐ పోర్ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లతో పాటు అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్‌లను చేసుకోవచ్చు. రోజంతా వినియోగదారులను కనెక్ట్ చేసేందుకు పోకో సి65 బలమైన 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 10డబ్ల్యూ సి-టైప్ ఛార్జర్ ద్వారా అందిస్తుంది.
భారతీయ మార్కెట్లో పోకో సి65 ధర :
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి65 డిసెంబర్ 18, 2023న మధ్యాహ్నం 12 గంటల నుంచి పాస్టెల్ బ్లూ, మ్యాట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 7,499కు సొంతం చేసుకోవచ్చు. ఇందులో 4జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ. 10,999, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 8,499, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 9,499, ప్రత్యేక సేల్ డే ఆఫర్‌గా కస్టమర్‌లు ఈ డివైజ్ ధర వరుసగా 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్‌లకు రూ. 7,499, రూ. 8,499, రూ. 9,999, ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలతో రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.