Smartphone Offer: 15వేల 999రూపాయల 5G స్మార్ట్‌ఫోన్‌.. కేవలం రూ. 799కే!

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని బడ్జెట్‌లో కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కేవలం రూ. 800లకే రూ.16వేల ఫోన్‌ను ఎలా పొందవచ్చో తెలుసుకోండి.

Smartphone Offer: 15వేల 999రూపాయల 5G స్మార్ట్‌ఫోన్‌.. కేవలం రూ. 799కే!

Poco

Updated On : February 19, 2022 / 9:22 PM IST

Smartphone Offer: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని బడ్జెట్‌లో కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కేవలం రూ. 800లకే రూ.16వేల ఫోన్‌ను ఎలా పొందవచ్చో తెలుసుకోండి. కేవలం 799 రూపాయలకు 15వేల 999 రూపాయల ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, 5G స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో 64 GB ఇంటర్నల్ మెమరీతో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని 128 GB వరకు పెంచుకోవచ్చు.

POCO M3 Pro 5G కూల్ బ్లూ, 4 GB RAM ర్యామ్ వేరియంట్ ధర రూ. 15999. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం తగ్గింపులో లభిస్తోంది. ఆ తగ్గింపు తర్వాత దీని ధర 13వేల 499కి వచ్చేసింది. దీనిపై 12వేల 700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా మీరు ఫోన్‌ని కేవలం రూ. 799కే కొనుగోలు చేయవచ్చు. అయితే, మీ ఫోన్ మోడల్ మరియు పరిస్థితిని బట్టి ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది అనేది తెలుస్తుంది.

MediaTek Dimension 700 ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఉండగా.. డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే ఇందులో ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్స్ 2 కెమెరాలు 2-2 మెగాపిక్సెల్స్. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఇది 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ డ్యూయల్ సిమ్, రెండు పోర్ట్‌లు 5G సపోర్ట్‌తో పనిచేస్తుంది.

ఇందులో ఇచ్చిన సిమ్ స్లాట్ హైబ్రిడ్ అయినప్పటికీ, ఒక సిమ్, ఒక మైక్రో SD కార్డ్ లేదా రెండు సిమ్‌లను ఒకేసారి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. SIM, మైక్రో SD కార్డ్ రెండూ ఏకకాలంలో పనిచేయవు. ఇది Google Android 11లో పని చేస్తుంది.