Poco M6 Plus 5G Launch : 108 భారీ కెమెరాతో పోకో M6 ప్లస్ 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Poco M6 Plus 5G Launch : ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో కొనుగోలుకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Poco M6 Plus 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. అదే.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) చిప్సెట్, 8జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది.
డ్యూయల్-సైడెడ్ గ్లాస్ డిజైన్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే.. ఐపీ53-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 108ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.79-అంగుళాల 120హెచ్‌జెడ్ ఫుల్-హెచ్డీ+ డిస్ప్లేను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ పోకో ఎమ్6 5జీ, పోకో ఎమ్6 ప్రో 5జీ లైనప్‌లో చేరింది.
భారత్‌లో పోకో ఎమ్6 ప్లస్ 5జీ ధర :
పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్ 6జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 13,499. అయితే, 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 14,499కు అందిస్తుంది. ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో కొనుగోలుకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
పోకో ఎమ్6 ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
పోకో ఎమ్6 ప్లస్ 5జీ 120హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.79-అంగుళాల ఫుల్-హెచ్డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. మరో 8జీబీ వర్చువల్ ర్యామ్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్ రన్ అవుతుంది. రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 108ఎంపీ మెయిన్ సెన్సార్ 3ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్లకు ఫ్రంట్ సైడ్ 13ఎంపీ కెమెరా కూడా ఉంది.
పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని అందిస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ ఐపీ53 రేటింగ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ సైజులో 168.6 x 76.28 x 8.3 మిమీ, బరువు 205 గ్రాములు ఉంటుంది.
Read Also : Honor Magic 6 Pro : కొత్త ఫోన్ కావాలా? హానర్ మ్యాజిక్ 6ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?