పబ్జి రీఎంట్రీ?: ఇండియాలో పబ్‌జీ కార్పొరేషన్ చేతుల్లోకి PUBG Mobile

PUBG Mobile Ban: ఇండియాలో పబ్‌జీ మొబైల్ యాప్‌ను తన చేతుల్లోకి తీసుకుంది పబ్ జీ కార్పొరేషన్.. భారతదేశంలో చైనా యాప్స్ లపై నిషేధం విధించడంతో PUBG మొబైల్ ప్రాంచైజీగా ఉన్న Shenzhen ఆధారిత Tencent Games నుంచి యాప్ అన్ని బాధ్యతలను పబ్ జీ కార్పొరేషన్ కంపెనీ స్వీకరించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
గత వారం ఇండియాలో PUBG మొబైల్‌పై నిషేధం విధించడంతో పబ్ జీ కార్పొరేషన్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. PUBG మొబైల్ తో పాటు PUBG మొబైల్ Lite ఇతర 116 చైనీస్-ఆధారిత గేమ్ యాప్స్ లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. PUBG మొబైల్ ప్రాంచైజీ టెన్సెంట్.. భారతదేశంలో తమ యాప్ నిషేధాన్ని ఎత్తివేసేందుకు భారత అధికారులతో చర్చలు జరిపింది.
ఈ కమ్రంలో బాటిల రాయల్ గేమ్ డెవలపర్ PUBG కార్పొరేషన్.. టెన్సెంట్ గేమ్స్ నుంచి పబ్ జీ మొబైల్ యాప్ నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వివరాలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
PUBG కార్పొరేషన్ దక్షిణ కొరియా వీడియో గేమ్ సంస్థ Krafton Game Union అనుబంధ సంస్థ కూడా.. ఇది ఇప్పటికే PC కన్సోల్ గేమర్‌ల కోసం ఉద్దేశించిన PUBG డెవలపర్ పబ్లీషర్. PUBG మొబైల్, PUBG మొబైల్ లైట్ PUBG కార్పొరేషన్ టెన్సెంట్ గేమ్స్ మధ్య సహకారంతో ఈ గేమ్స్ క్రియేట్ చేశాయి.
PUBG కార్పొరేషన్ దేశంలోని గేమింగ్ కమ్యూనిటీతో ఎస్పోర్ట్స్ కమ్యూనిటీ ఈవెంట్స్‌తో సహా వివిధ ప్రాంత-ఆధారిత ఆపరేషన్ల ద్వారా పాల్గొనడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఇండియాలో ప్రస్తుత గేమర్స్, స్ట్రీమర్లు కంపెనీలకు PUBG మొబైల్‌పై ఆధారపడే కంపెనీలకు ఏమైనా రిలీఫ్ ఉంటుందా? లేదా అనే దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..