PUBG Removes Cheating Users: అలా చేశారో “బ్లాక్” పడుద్ది: ఆటగాళ్లకు “పబ్జి” గేమ్ సంస్థ వార్నింగ్
పబ్జీ ఆట ఆడేవారికి ఇది చేదు వార్త. గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు అనవసర తప్పిదాలు చేస్తే ఆయా యూజర్లను బ్లాక్ చేసి, వారి సభ్యత్వాన్ని శాశ్వతంగ తొలగిస్తుంది

Pubg Game
PUBG Removes Cheating Users: పబ్జీ ఆట ఆడేవారికి ఇది చేదు వార్త. గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు అనవసర తప్పిదాలు చేస్తే ఆయా యూజర్లను బ్లాక్ చేసి, వారి సభ్యత్వాన్ని శాశ్వతంగ తొలగిస్తుంది పబ్జీ సంస్థ. ఈమేరకు గేమ్ ను తయారు చేసిన “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” సంస్థ ఒక హెచ్చరిక జారీ చేసింది. తమ గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్న అనేక మంది యూజర్లు చీటింగ్, హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించిన సంస్థ ఆమేరకు ఆయా యూజర్లను నిర్ధాక్షిణ్యంగా బ్లాక్ చేసింది. భారత్ లో గేమ్ లో చీటింగ్ చేస్తున్న డిసెంబర్ 13 – 19 మధ్య దాదాపు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ను బ్యాన్ చేశామని “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” తెలిపింది.
పబ్జి గేమ్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు గేమ్ ను బైపాస్ చేసి, చీటింగ్ పాల్పడుతున్నారని, తద్వారా అది గేమ్ పాలసీ. డెవలప్మెంట్ కి ఆటంకంగా మారినట్లు గేమ్ ను అభివృద్ధి చేస్తున్న “క్రాఫ్ట్ఆన్ సంస్థ” తెలిపింది. మొత్తంగా డిసెంబర్ 6 నుంచి 19 మధ్య కాలంలో సుమారు 250000 వేల మంది మోసపూరిత యూజర్లను తొలగించినట్లు “క్రాఫ్ట్ఆన్ సంస్థ” తెలిపింది. ఇకపై కూడా ఇటువంటి చీటింగ్ లకు పాల్పడే వారిని తొలగిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అనధికారిక సర్వర్ల నుండి గేమ్ ను డౌన్లొడ్ చేసుకున్న యూజర్లు, తమ ఫోన్ లలో గేమ్ హ్యాకింగ్ టూల్స్ ని వినియోగించిన యూజర్లను టార్గెట్ గా చేసుకుని ఈతరహా చర్యలు తీసుకున్నట్లు “క్రాఫ్ట్ఆన్ సంస్థ” పేర్కొంది.
ఇక తొలగించిన, బ్లాక్ చేయబడ్డ వినియోగదారులు ఇప్పుడప్పుడే గేమ్ ఆడేందుకు వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంది సంస్థ. గేమ్ యొక్క ప్రమాణాలు, నాణ్యతను దెబ్బతినకుండా, ఇకపై మరింత కఠినంగా ఆంక్షలు విధించనున్నట్లు కూడా క్రాఫ్ట్ఆన్ హెచ్చరించింది. ఎటువంటి హ్యాకింగ్, చీటింగ్ కి పాల్పడకుండా, చక్కని వాతావరణంలో గేమ్ ను ఆస్వాదించాలని “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” తన యూజర్లను కోరింది.
Also Read: TVS Apache RTR New Bike:పవర్ ప్యాకెడ్ వెర్షన్ ఈ “టీవీఎస్ అపాచీ ఆర్.టీ.ఆర్ 165ఆర్.పీ”