భారీ డిస్కౌంట్.. రూ.32 వేల స్మార్ట్‌ఫోన్ రూ.12,500కే.. ఇంకా ఆలోచిస్తున్నారా?
ధర, ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే.

Realme GT 6T
అమెజాన్‌లో ప్రస్తుతం తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. మంచి ఫీచర్లతో తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ కొనాలని మీరు అనుకుంటున్నారా? అయితే, రియల్మీ జీటీ 6టీ ధర, ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే.
రియల్మీ జీటీ 6టీను గత ఏడాది మే 22న అధికారికంగా లాంచ్ చేశారు. అదే ఏడాది మే 28 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు వీటిపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
డిస్కౌంట్
లాంచ్ సమయంలో రియల్మీ జీటీ 6టీ ధర రూ.32,999గా ఉంది. ఇప్పుడు అమెజాన్‌లో 19 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దీంతో దీని ధర కేవలం రూ.28,998కి తగ్గుతుంది. ఈ ఆఫర్‌తో 8GB RAM, 256 GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. అంతేకాదు, దీనిపై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Also Read: రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం.. పంపిణీని ప్రారంభించిన సీఎం
కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులను వాడితే అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు ధరలో కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, యూజర్లకు రూ.5,000 కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌లు అన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను దాదాపు రూ.22,498కి పొందవచ్చు.
అమెజాన్ ఒక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకుని రూ.27,350 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌కి రూ.15,000 వస్తే, మీరు రియల్మీ జీటీ 6టీని కేవలం రూ.12,350కి పొందవచ్చు.
ఫీచర్లు
రియల్మీ జీటీ 6టీ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్‌తో అందుబాటులో ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, 6000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఉంటుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను అందులో వాడారు. స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. డ్యూయల్-కెమెరా సెటప్‌లో 50, 8-మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. 5500mAh బ్యాటరీ సామర్థ్యంలో ఇది అందుబాటులోకి వచ్చింది.