Realme Narzo 30 5G : రియల్‌మి నుంచి 5G, 4G స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఒకటి 5G వెర్షన్ మరొకటి 4G వెర్షన్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకే వేరియంట్ మోడల్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

Realme Narzo 30 5g Phone Launched In India
Realme Narzo 30 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఒకటి 5G వెర్షన్ మరొకటి 4G వెర్షన్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకే వేరియంట్ మోడల్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అవే.. Realme Narzo 30 5G వెర్షన్, Realme Narzo 30 4G వెర్షన్.. ఇప్పటికే మార్కెట్లోకి Narzo 30 సిరీస్ (Narzo 30 Pro 5G, Narzo 30A) లాంచ్ చేసింది రియల్ మి..
ఇటీవలే ఈ రెండు ఫోన్లను మలేసియా, యూరప్‌లో లాంచ్ చేసింది కంపెనీ. మరికొద్ది నెలల్లో ఈ రెండు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రెండు 5G, 4G ఫోన్లు నార్జో 30 ప్రో 5జీ, రియల్‌మి 8 (5G), రెడ్ మి నోట్ 10 ప్రో, మోటోరోలా మోటో G60 ఫ్యూజన్, ఒప్పో A54 వెర్షన్ల మాదిరిగానే ఉండనున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల రాకపై ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది క్లారిటీ లేదు.
భారత మార్కెట్లలో Realme Narzo 30 5G, Narzo 30 4G స్మార్ట్ ఫోన్లలో ఒక్కో సింగిల్ వేరియంట్ ధర రూ.15,999ల నుంచి ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ సేల్ లో కొనుగోలు చేసేవారికి రూ.500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తగ్గింపు ధర రూ.15,499లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే Narzo 30 వేరియంట్ (4GB RAM, 64GB స్టోరేజీ వెర్షన్ ధర రూ.12,499 ఉండొచ్చు. ఈ మోడల్ కూడా ఫస్ట్ సేల్ కొంటే.. రూ.500 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో రూ.11,999లకే పొందవచ్చు. మరో స్టోరేజీ వేరియంట్ 6GB RAM, 128GB స్టోరేజీ వెర్షన్ ల ధరలు కూడా రూ.14,499 ఉండనున్నాయి. ఈ ఫోన్ మోడళ్లపై మాత్రం రూ.500 డిస్కౌంట్ వర్తించదు. Narzo 30 5G, 4G వెర్షన్లు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ కలర్లలో రానున్నాయి.
Realme Narzo 30 5G ఫస్ట్ సేల్.. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, రియల్ మి ఆన్‌లైన్ స్టోర్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో జూన్ 30 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే Narzo 30 4G ఫోన్ సేల్ కూడా ఇవే ప్లాట్ ఫాంలపై జూన్ 29 నుంచి అందుబాటులోకి రానుంది.
Narzo 30 5G, 4G ఫీచర్లు ఇవే :
– 6.5 అంగుళాల Full-HD+ డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో.
– ఆక్టా-కోర్ మెడిక్ డైమన్ సిటీ 700 ప్రాసెసర్ (5G)
– మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్ (4G)
– 6GB RAM (5G), 4GB, 6GB RAM (4G)
– ఇంటర్నల్ మెమెరీ 128GB (4G,5G), 1TB మైక్రో SD కార్డ్
– ఫంచ్ హోల్ (టాప్ లెఫ్ట్), 16MP సెల్ఫీ కెమెరా
– ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మి UI 2.0
– సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
– 48MP మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP బ్లాక్ అండ్ వైట్ కెమెరా (బ్యాక్) (5G)
– నైట్ స్కేప్ మోడ్, AI బ్యూటీ
– 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ (5G)
– 30W ఫాస్ట్ ఛార్జింగ్ (USB-C port) (4G)
– Wi-Fi, బ్లూటూత్, GPS, 3.5mm హెడ్ ఫోన్ జాక్ (5G)
– 185 గ్రాముల బరువు (5G), 192 గ్రాములు (4G)