Realme Note 50 Launch : ఈ నెల 23న రియల్‌మి నోట్ 50 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
Realme Note 50 Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లోకి రియల్‌మి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. రియల్‌మి నోట్ 50 ఫోన్ లాంచ్ డేట్ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme Note 50 Launch Set for January 23; Specifications Listed by Retailer Site
Realme Note 50 Launch : రియల్‌మి నోట్ 50 ఫోన్ ఈ నెల 23న ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ మేరకు కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ రాకను ధృవీకరించింది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ధర వివరాలు, స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీ మల్టీ పోస్టర్‌లను షేర్ చేసింది.
అలాగే, ఈ హ్యాండ్‌సెట్ రిటైలర్ వెబ్‌సైట్‌లో జాబితా అయింది. రియల్‌మి నోట్ 50 ఫోన్ 6.7-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. రియల్‌మి నోట్ 50 ఫోన్ అనేది రియల్‌మి సి51 రీబ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కొత్త నోట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి హ్యాండ్‌సెట్ రియల్‌మి నోట్ 50 మోడల్ జనవరి 23న ఫిలిప్పీన్స్‌లో ప్రకటించనుంది. రియల్‌మి ట్విట్టర్‌లో షేర్ చేసిన టీజర్ పోస్టర్‌ల ప్రకారం.. పీహెచ్‌పీ 3,599 (దాదాపు రూ. 6వేలు) ధర ట్యాగ్‌తో వస్తాయి.
షేర్డ్ టీజర్‌ల ప్రకారం.. రియల్‌మి నోట్ 50 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకతకు 7.99ఎమ్ఎమ్ మందంతో ఐపీ54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం షాపీ మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందించనుంది.

Realme Note 50 Launch
రియల్‌మి నోట్ 50 ఫోన్ ధర :
ఈ జాబితా ప్రకారం.. రియల్‌మి నోట్ 50 ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత రియల్‌మి యూఐ టీ ఎడిషన్‌పై నడుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో యూనిసోక్ టీ612 చిప్ ఆన్‌బోర్డ్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. లిస్టింగ్ 13ఎంపీ ప్రైమరీ షూటర్, సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను సూచిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉంది. 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రియల్‌మి నోట్ 50 ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని లిస్టింగ్ చూపిస్తుంది. 167.7×76.67×7.99ఎమ్ఎమ్ 186 గ్రాములు ఉంటుంది. రియల్‌మి నోట్ 50 మోడల్ రియల్‌మి సి51కి సరికొత్త వెర్షన్‌గా రానుంది.
Read Also : Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?