Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ స్పెషల్ ధర ఎంతో తెలుసా?

Realme P1 Pro Sale : రియల్‌మి పి1 ప్రో 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 ఉండగా రూ.20,999కి తగ్గింది. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది.

Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ స్పెషల్ ధర ఎంతో తెలుసా?

Realme P1 Pro sale in India ( Image Source : Google )

Realme P1 Pro Sale : ఈ ఏడాది ఏప్రిల్‌లో రియల్‌మి భారతీయ మార్కెట్లో రియల్‌మి పి1తో పాటు రియల్‌‌మి పి1 ప్రోని ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ రూ. 25వేల లోపు సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. రియల్‌మి పి1 ప్రో ఫోన్ సింగిల్ 8జీబీ ర్యామ్ వేరియంట్‌తో వస్తుంది. అయితే, రియల్‌మి ఇటీవల 12జీబీ ర్యామ్‌తో పి1 ప్రో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ఫస్ట్ సేల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.

Read Also : Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?

రియల్‌మి పి1 ప్రో కొత్త వేరియంట్‌ :
రియల్‌మి పి1 ప్రో 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అమ్మకపు ధర రూ. 22,999. అయితే, పరిమిత కాలానికి ఈ ధర రూ.20,999కి తగ్గింది. దాంతో పాటు 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. బడ్జెట్‌ను తగ్గించకుండా తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న వారికి హై-ఎండ్ 12జీబీ+256జీబీ వేరియంట్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ రియల్‌మి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ రియల్‌మి ఫోన్ రెండు ఇతర స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. అందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ మరొకటి. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్యారెట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మల్టీమీడియా వినియోగం, గేమింగ్‌కు అనువైన మృదువైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్క్రీన్ 2,000 నిట్‌ల బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా ప్రకాశవంతంగా సులభంగా స్ర్కీన్ చూడవచ్చు.

రియల్‌మి పి1 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
హుడ్ కింద రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ చిప్‌సెట్ ఫోన్ రోజువారీ వినియోగం నుంచి మరింత డిమాండ్ ఉన్న అప్లికేషన్‌లు, గేమ్‌ల వరకు వివిధ రకాల టాస్కులను వేగంగా పూర్తి చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. వినియోగదారులకు గూగుల్ నుంచి లేటెస్ట్ ఫీచర్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. రియల్‌మి పి1 ప్రోలో కెమెరా సెటప్ మరో హైలైట్. ప్రాథమిక కెమెరా సోనీ ఎల్‌వైటీ-600 టెక్నాలజీని కలిగిన 50ఎంపీ సెన్సార్ కలిగి ఉంది. ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు.

ప్రైమరీ కెమెరాకు 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం రూపొందించిన 16ఎంపీ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ లైఫ్ అనేది చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కీలకమైన అంశం. అందుకే, రియల్‌మి పి1ప్రో ఇదే ఫీచర్‌పై దృష్టి పెడుతుంది. భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రియల్‌మి ప్రకారం.. 473.58 గంటల స్టాండ్‌బై టైమ్, 35 గంటల కాలింగ్, 20 గంటల కన్నా ఎక్కువ మూవీ వ్యూ, 85 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 12 గంటల కన్నా ఎక్కువ నావిగేషన్‌ను అందిస్తుంది. రిటైల్ బాక్స్‌లో 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జర్ కూడా అందిస్తుంది.

Read Also : Realme C61 Launch : రూ.10వేల లోపు ధరలో రియల్‌మి C61 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!