Realme Pro Series Sale : ఈ నెల 22 నుంచే రియల్‌‌మి P1 ప్రో సిరీస్ సేల్.. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

Realme Pro Series Sale : రియల్‌మి పి1, పి1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్‌సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్‌సెట్, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా మరిన్ని ఫీచర్లతో వస్తాయి.

Realme Pro Series Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి కొత్త పి-సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త లైనప్‌లో 2 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో రియల్‌మి పి1, రియల్‌మి పి1 ప్రో ఉన్నాయి. ఈ సిరీస్‌లో ‘పి’ మోడల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ సూచిస్తుంది. రియల్‌మి పి1, పి1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్‌సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్‌సెట్, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా మరిన్ని ఫీచర్లతో వస్తాయి.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

ఈ సిరీస్ ధర రూ. 21,99 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ధరలపై మరింత తగ్గింపు పొందేందుకు అనేక బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే వారం ఏప్రిల్ 22న అమ్మకానికి రానున్నాయి. రియల్‌మి పి1 5జీ ఫోన్, రియల్‌మి పి1ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల ఫస్ట్ సేల్ సమయంలో అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి పి1, పి1 ప్రో సేల్, బ్యాంక్ ఆఫర్లు :
రియల్‌మి పి1 5జీ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత అదే రోజున రియల్‌మి పి1 ప్రో 5జీ రెడ్ లిమిటెడ్ సేల్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకు 2 గంటల పాటు కొనసాగుతుంది. ఈ రెండు సేల్స్ రియల్‌మి, ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులో ఉంది. రియల్‌మి పి1, పి1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై అనేక బ్యాంక్ ఆఫర్‌లను కూడా ప్రకటించింది.

రియల్‌మి పి1 5జీ ఫస్ట్ సేల్‌లో కొనుగోలుదారులు 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్‌పై రూ. వెయ్యి ఫ్లాట్ డిస్కౌంట్, 8జీబీ ర్యామ్, 256జీబీ మోడల్‌పై రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. రియల్‌మి పి1ప్రో 5జీ ఫోన్ రెడ్ లిమిటెడ్ సేల్ సమయంలో కస్టమర్‌లు 3 నెలల పాటు (realme.com, Flipkart)లో ఈఎంఐపై ఎలాంటి ఖర్చు లేకుండా రూ. 2వేల వరకు విలువైన బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు.

రియల్‌మి పి1 ప్రో అనే 2 కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 22,999 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌తో బేస్ మోడల్ ధర రూ.19,999కి, టాప్-ఎండ్ మోడల్ ధర రూ.20,999కి తగ్గుతుంది. రియల్‌మి పి1ని చూసే వారికి 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, 256జీబీ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.18,999కు అందిస్తుంది. ఈ సేల్ ఆఫర్‌తో రియల్‌మి పి1 ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్ మోడల్ ధర రూ. 16,999కి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి పి1, పి1 ప్రో స్పెక్స్, ఫీచర్లు :
రియల్‌‌మి పి1 సిరీస్‌లో 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేతో హై120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశంతో 2,000నిట్‌లు, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, కంటి భద్రతకు టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్‌తో అమర్చి ఉంది. పోల్చి చూస్తే.. ప్రో వేరియంట్ ఒకే విధమైన స్క్రీన్ సైజు కలిగి ఉంది. కానీ, ప్రో-హెచ్‌డీఆర్, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హైపర్‌ప్రెసిస్ టచ్ సపోర్ట్ ద్వారా అప్‌గ్రేడ్ కర్వ్డ్ ప్యానెల్‌తో వస్తుంది.

రియల్‌మి పి1 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ అయితే, ప్రో కౌంటర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీపై ఆధారపడుతుంది. రెండు వెర్షన్లు గరిష్టంగా 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని అందిస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా అదనపు స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ప్రామాణిక రియల్‌మి P1 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరాను ఎఫ్/1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంది. దాంతో పాటు 2ఎంపీ బీఅండ్ డబ్య్లూ సెకండరీ సెన్సార్ ఉంటుంది. రియల్‌మి పి1ప్రో అదే ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కానీ, 8ఎంపీ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. రెండు మోడల్స్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తాయి. అదనంగా, రెండు స్మార్ట్‌ఫోన్‌లు 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి.

Read Also : Realme Narzo 70x 5G : రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 24నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు