Realme P3 Lite 5G : భారీ బ్యాటరీతో రియల్‌మి P3 సిరీస్ వచ్చేసిందోచ్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే.. త్వరపడండి..!
Realme P3 Lite 5G : అత్యంత సరసమైన మోడల్‌గా రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 6,000mAh బ్యాటరీ, 32MP కెమెరా కలిగి ఉంది.

Realme P3 Lite 5G
Realme P3 Lite 5G : రియల్‌మి కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ వచ్చేసింది. అత్యంత సరసమైన 5G లైనప్‌ను రియల్‌మి విస్తరించింది. రియల్‌మి P3 సిరీస్‌లో అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్‌గా నిలుస్తోంది.
ఈ రియల్‌మి ఫోన్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీ, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్, 32MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. రియల్‌మి P3 సిరీస్ (Realme P3 Lite 5G) తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది.
రియల్‌మి P3 లైట్ 5జీ భారత్ ధర, లభ్యత :
రియల్‌మి 5జీ ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
4GB RAM + 128GB స్టోరేజ్ : ప్రారంభ ధర రూ. 12,999.
6GB RAM + 128GB స్టోరేజ్ : ధర రూ.13,999.
ఈ ఫోన్ లిల్లీ వైట్, పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిల్లీ 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సెప్టెంబర్ 22 అర్ధరాత్రి ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు రూ.2,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ రియల్‌మి P3 లైట్ 5జీ ప్రారంభ ధర రూ.10,499కి తగ్గుతుంది.
రియల్‌మి P3 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : 720 x 1604 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల భారీ HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 625 నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. తడి చేతులతో కూడా ఆపరేట్ చేసేలా “రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్” ఫంక్షన్ కూడా కలిగి ఉంది.
ప్రాసెసర్, స్టోరేజీ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB వరకు ర్యామ్, వర్చువల్‌గా 18GB వరకు విస్తరించవచ్చు. 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్, 2TB వరకు పెంచుకోవచ్చు.
బ్యాటరీ : 6000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UIపై రన్ అవుతుంది.
కెమెరాలు : బ్యాక్ సైడ్ 32MP ప్రైమరీ కెమెరా, సెకండరీ సెన్సార్, డ్యూయల్-కెమెరా సెటప్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.