Redmi 12C Discount : రూ. 7వేల కన్నా తక్కువ ధరకే రెడ్‌మి 12C ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా..!

Redmi 12C Discount : వచ్చే డిసెంబర్‌లో రెడ్‌మి 13సి ఫోన్ లాంచ్‌కు ముందుగానే మరో రెడ్‌మి 12సి ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Redmi 12C Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి 13సి వచ్చే నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందుగానే రెడ్‌మి 12సీ ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్ 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే.. రూ. 7వేల లోపు ధరకే కొనుగోలు చేయొచ్చు. భారత మార్కెట్లో ఈ ఏడాది మార్చిలో రెడ్‌మి 12సీ లాంచ్ అయింది. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ, వినియోగదారులను ఆకట్టుకునే డిజైన్‌ కలిగి ఉంది.

రెడ్‌మి 12సీ తగ్గింపు :
ఇప్పుడు, రెడ్‌మి 12సీ ఫోన్ 64జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 13,999కు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఫోన్ అమెజాన్‌లో 51 శాతం ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 6,799కి అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299కు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ.9,299కు సొంతం చేసుకోవచ్చు.

Read Also : Gautam Adani : ప్రపంచ టాప్ 20 సంపన్నుల జాబితాలోకి గౌతమ్ అదానీ రీఎంట్రీ..!

రెడ్‌మి 12సి టాప్ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి 12సి మెరుగైన భద్రత కోసం బ్యాక్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. షావోమీ ఇతర రెడ్‌మి నోట్ డివైజ్‌లతో సహా చాలా స్మార్ట్‌ఫోన్‌లు అండర్-డిస్‌ప్లే సెన్సార్ లేదా సైడ్-మౌంటెడ్ స్కానర్‌ని కలిగి ఉన్నాయి. అదనంగా, రెడ్‌మి 12సీ ఐపీ52-రేటెడ్, డెస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. రెడ్‌మి 12సీ ఛార్జింగ్ (10డబ్ల్యూ) కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ను కలిగి ఉంది.

Redmi 12C Discount

మోటోరోలా లేటెస్ట్ మోటో E13లో చూసినట్లుగా.. యూనివర్సల్ యూఎస్‌బీ-C పోర్ట్ ఉంటుంది. రెడ్‌మి 12సీ ధరతో సమానంగా ఉన్నప్పటికీ ఛార్జింగ్ టైప్-C పోర్ట్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక కెమెరా సిస్టమ్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, అదనపు సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా, ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ప్రామాణిక ఎల్‌సీడీ ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తుంది.

డిసెంబర్ 6న రెడ్‌మి 13సీ లాంచ్ :
రాబోయే రెడ్‌మి 13సి డిసెంబర్ 6 న భారతీయ మార్కెట్లోకి వస్తుంది. ఈ కొత్త ఫోన్ లాంచ్‌ను ప్రకటిస్తూ రెడ్‌మి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆకర్షణీయమైన (#StarShineDesign)లో సరికొత్త (#Redmi13C)ని లాంచ్ చేయనుంది. ఇటీవల లైవ్ అయిన పేజీలో ఫోన్ ప్రొడక్ట్ పేజీ నుంచి ఫోన్ స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్‌షైన్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని నిర్ధారించవచ్చు. అదనంగా, షావోమీ శక్తివంతమైన 50ఎంపీ ఏఐ కెమెరా కూడా ఉంటుందని ధృవీకరించింది.

Read Also : Infinix Hot 40i Launch : ఇన్పినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు