Redmi 13 5G: బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ అదుర్స్.. ఏం ఉంది మామా.. కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి..
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు..

Redmi 13R 5G
మిడ్‌రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో రెడ్‌మీ మరోసారి యూజర్లను ఆకర్షిస్తోంది. రెడ్‌మీ 13 5G ప్రీమియం లుక్‌తో పాటు ఎన్నో ఫీచర్లతో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. సిల్కీ స్మూత్ డిస్‌ప్లే, శక్తిమంతమైన 5G ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. ఇవన్నీ ఈ ఒకే ఫోనులో ఉన్నాయి.
రెడ్‌మీ 13 5G ఫీచర్లు
ప్రాసెసర్
రెడ్‌మీ 13 5Gలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE చిప్‌సెట్ ఉంది. ఇది శక్తిమంతమైన 5G పనితీరు, మల్టీటాస్కింగ్‌కి అనుకూలంగా ఉంది. 2.3GHz క్లాక్ స్పీడ్‌తో ప్రాసెసర్‌తో వచ్చింది. 6GB RAMతో పాటు అదనంగా 6GB వర్చువల్ ర్యామ్‌తో సోషల్ మీడియా యాప్స్‌కి, లైట్ గేమ్స్‌కి హ్యాంగ్ లేకుండా పని చేస్తుంది.
డిస్‌ప్లే, బ్యాటరీ
రెడ్‌మీ 13 5Gలో 6.79-అంగుళాల IPS డిస్‌ప్లే ఉంది. 1080×2460 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. తడిచిన వేళ్లతో కూడా స్క్రీన్ స్పందిస్తుంది. 5030mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ వస్తుంది.
కెమెరా
రెడ్‌మీ 13 5G ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, మాక్రో లెన్స్‌తో పాటు వచ్చింది. అయితే, రాత్రి సమయంలో ఫొటోలు తక్కువ స్పష్టతలో వస్తాయి. 13MP సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్, సోషల్ మీడియా సెల్ఫీలకు సరిపోతుంది. వీడియో రికార్డింగ్ 1080p@30fps వరకు తీసుకోవచ్చు. కెమెరా సెగ్మెంట్‌లో చాలా స్ట్రాంగ్ కాకపోయినా సాధారణ వాడుకదారులకు సరిపోతుంది.
ధర
ప్రారంభ ధర రూ.17,999. ప్రస్తుతం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో రూ.11,749కి వస్తుంది. అంటే 35% తగ్గింపుతో అందుబాటులో ఉంది. EMI రూ.570 నుంచి ప్రారంభమవుతుంది. నో-కాస్ట్ EMI అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు
అమెజాన్ Pay ICICI క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ.352 క్యాష్‌బ్యాక్ అమెజాన్ Pay Balanceలో లభిస్తుంది. కొంతమంది వినియోగదారులకు EMI మీద రూ.746.49 వరకు వడ్డీ సేవింగ్స్ అవకాశం ఉంది. బిజినెస్ కస్టమర్లకు GST బిల్లింగ్ ద్వారా 28% వరకు సేవింగ్ అవకాశముంది.