Redmi K80 Ultra : మొబైల్ గేమర్లకు పండగే.. కొత్త రెడ్‌మి K80 అల్ట్రా ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా..!

Redmi K80 Ultra : ఫ్లాగ్‌షిప్-లెవల్ పవర్ అత్యాధునిక గేమింగ్ ఫీచర్లతో రెడ్‌మి K80 అల్ట్రా వచ్చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్ లాంగ్ బ్యాటరీతో ఆకట్టుకునేలా ఉంది.

Redmi K80 Ultra : మొబైల్ గేమర్లకు పండగే.. కొత్త రెడ్‌మి K80 అల్ట్రా ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా..!

Redmi K80 Ultra Launch

Updated On : June 27, 2025 / 10:45 AM IST

Redmi K80 Ultra Launch : రెడ్‌మి యూజర్ల కోసం కొత్త అల్ట్రా ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో రెడ్‌మి K80 అల్ట్రాను ఆవిష్కరించింది. ప్రీమియం గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌గా (Redmi K80 Ultra) మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అల్ట్రా ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400+ SoC ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు ర్యామ్ కలిగి ఉంటుంది.

హై రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో వస్తుంది. 7,410mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. IP68 రేటింగ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 1TB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది.

Read Also : iPhone 16 Offer : ఆపిల్ ఐఫోన్ 16పై అదిరే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. కొనేవరకు ఆగలేరు..!

రెడ్‌మి K80 అల్ట్రా : ధర, లభ్యత :

  • రెడ్‌మి K80 అల్ట్రా చైనాలో అనేక కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ అయింది.
  • 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్: CNY 2,599 (సుమారు రూ. 31,000)
  • 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్: CNY 2,999 (సుమారు రూ. 35,800)
  • 16GB ర్యామ్ + 256GB స్టోరేజ్: CNY 2,799 (సుమారు రూ. 33,400)
  • 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్: CNY 3,299 (సుమారు రూ. 39,400)
  • 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్: CNY 3,799 (సుమారు రూ. 45,400)

4 కలర్ ఆప్షన్లు :

  • ఐస్ బ్లూ
  • మూన్ రాక్ వైట్
  • శాండ్ స్టోన్ యాష్
  • స్ప్రూస్ గ్రీన్

కొత్త రెడ్‌మి K80 అల్ట్రా సేల్ చైనా మార్కెట్లో షావోమీ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు, ముఖ్య ఫీచర్లు :
డిస్‌ప్లే, డిజైన్ :
6.83-అంగుళాల 1.5K OLED స్క్రీన్ (1280×2772 పిక్సెల్స్)
144Hz రిఫ్రెష్ రేట్, 2,560Hz PWM డిమ్మింగ్
480Hz టచ్ శాంప్లింగ్ రేట్, షావోమీ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్
IP68 వాటర్, డస్ట్ నిరోధకత

పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ :
మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ SoC (3nm ఆక్టా-కోర్)
16GB వరకు LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీ
HyperOS 2 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15

కెమెరా సెటప్ :
రియర్ కెమెరా : 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్
ఫ్రంట్ కెమెరా : 20MP సెల్ఫీ కెమెరా (హోల్-పంచ్)

బ్యాటరీ, ఛార్జింగ్ :
7,410mAh బ్యాటరీ సపోర్టు
100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు

Read Also : PAN Card 2.0 : QR కోడ్‌తో కొత్త పాన్ కార్డు 2.0 ఇదిగో.. అచ్చం ఆధార్‌లాగే .. బెనిఫిట్స్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..!

5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, GPS, A-GPS, NavIC
163.08×77.93×8.18mm
బరువు : 219 గ్రాములు