PAN Card 2.0 : QR కోడ్‌తో కొత్త పాన్ కార్డు 2.0 ఇదిగో.. అచ్చం ఆధార్‌లాగే .. బెనిఫిట్స్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..!

PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు తీసుకుంటున్నారా? పాన్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్.. కీలక బెనిఫిట్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..

PAN Card 2.0 : QR కోడ్‌తో కొత్త పాన్ కార్డు 2.0 ఇదిగో.. అచ్చం ఆధార్‌లాగే .. బెనిఫిట్స్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..!

PAN Card

Updated On : June 26, 2025 / 10:56 PM IST

PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు కావాలా? ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే పాన్ కార్డ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త పాన్ 2.0ను ప్రవేశపెట్టింది. సెక్యూరిటీ పరంగా మొత్తం ప్రక్రియను (PAN Card 2.0) సులభతరం
చేసింది. స్కాన్ చేయగల QR కోడ్‌తో e-PAN సౌకర్యాన్ని అందిస్తుంది. స్పీడ్ అథెంటికేషన్ అందిస్తుంది. పాన్ కార్డ్ ఫ్రాడ్ లేదా దుర్వినియోగ అవకాశాలను నివారిస్తుంది.

ఈ e-PAN డిజిటల్ వెర్షన్ ఫ్రీగా పొందవచ్చు. వెంటనే ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. నామమాత్రపు రుసుము చెల్లించిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ రిజిస్టర్ అడ్రస్‌కు చేరుకుంటుంది. మీకు ఇప్పటికే QR కోడ్ లేని సాధారణ PAN కార్డ్ ఉంటే.. అది ఇప్పటికీ పూర్తిగా వ్యాలీడ్ అని గమనించాలి.

ప్రత్యేకించి అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ సాయంతో పాన్ కార్డు గుర్తింపు చాలా ఈజీ. నవంబర్ 26న పాన్ 2.0 ప్రాజెక్ట్ సమాచారంపై పాన్ 2.0 ద్వారా పాన్, టాన్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది.

Read Also : Vivo Watch 5 : వివో స్మార్ట్ వాచ్ అదుర్స్.. ఏఐ ఫీచర్లతో eSIM మోడల్ భలే ఉందిగా.. 22 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

పాన్ 2.0 ద్వారా జారీ చేసిన పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆధార్ కార్డు మాదిరిగా ఉంటుంది. స్కాన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు.

దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు :

  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటరు గుర్తింపు కార్డు

NSDL ద్వారా (PAN Card 2.0) కార్డుకు ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

  • ముందుగా (Protean) రీ-ప్రింట్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
  • డిక్లరేషన్లను అంగీకరించి “Submit”పై క్లిక్ చేయండి.
  • మాస్క్ పాన్ వివరాలను ధృవీకరించండి.
  • OTP కోసం మొబైల్/ఇమెయిల్/రెండూ ఎంచుకోండి.
  • ఇప్పుడు OTP వస్తుంది. 10 నిమిషాల్లో వెరిఫై చేయండి.
  • ఆ తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లి.. నిబంధనలను అంగీకరించాలి.
  • రూ. 50 రుసుము చెల్లించండి.
  • పేమెంట్ తర్వాత మీకు రసీదు వస్తుంది.. అది సేవ్ చేసి పెట్టుకోండి.
  • 24 గంటల తర్వాత మీ e-PAN డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఫిజికల్ పాన్ కార్డ్ రిజిస్టర్డ్ అడ్రస్‌కు 15 రోజుల నుంచి 20 రోజుల్లో డెలివరీ అవుతుంది.