Redmi Note 13 5G Series : రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్లపై సేల్ మొదలైందోచ్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?
Redmi Note 13 5G Series : రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు. ధరలు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్ వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi Note 13, Note 13 Pro And Note 13 Pro Plus go on sale today
Redmi Note 13 5G Series : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి మూడు కొత్త వేరియంట్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ మోడల్‌లో ప్రధానంగా బేస్ వేరియంట్ రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ ఉన్నాయి.
Read Also : Apple iPhone 15 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. కొత్త ధర, బ్యాంకు ఆఫర్లు ఇవే..!
జనవరి 10 నుంచి ఈ రెడ్‌మి 5జీ ఫోన్లు దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ ధర రూ. 16,999, టాప్ మోడల్ హై-వేరియంట్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ రూ. 33,999కి పొందవచ్చు. లాంచ్ అయిన సమయంలో రెడ్‌మి ఇండియా స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సహా అనేక బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది.
రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ ధర, బ్యాంక్ ఆఫర్లు ఇవే :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ.16,999 ఉంటుంది. మిడ్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 18,999కు పొందవచ్చు. హై వేరియంట్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 20,999 నుంచి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ మోడల్ మొత్తం 3 స్టోరేజ్, ర్యామ్ ఆప్షన్లలో కూడా వస్తుంది.
ఏ మోడల్ ధర ఎంతంటే? :
ఈ మోడల్ ధర 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 23,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఆపై 8జీబీ ర్యామ్ మోడల్ 256జీబీ స్టోరేజ్‌తో రూ. 25,999, అత్యధిక వేరియంట్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంది. దీని ధర రూ. 27,999 నుంచి అందుబాటులో ఉంది. అత్యధిక రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ ధర 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ మోడల్ ధర రూ. 31,999 కాగా, టాప్ 12జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 33,999కు పొందవచ్చు.

Redmi Note 13, Note 13 Pro And Note 13 Pro Plus
లిమిటెడ్ ఆఫర్లు మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి :
ముఖ్యంగా, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 2వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మరోవైపు, ఐసీఐసీఐ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రెడ్‌మి నోట్ 13 5జీ కొనుగోలుపై రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు.
వినియోగదారులు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 2వేల వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. లాంచ్ చేసిన సమయంలో పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్‌లు నిర్దిష్ట కాలానికి పరిమితం కావచ్చని షావోమీ తెలిపింది. ఈ ఆఫర్ ఎంత కాలం చెల్లుబాటు అవుతుందో షియోమీ వెల్లడించలేదు. ఈ సేల్ ప్రారంభమైన మొదటి నెలలో మాత్రమే బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Read Also : Apple iPhone 14 Sale : రూ.60వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?