Reliance Jio quietly discontinued over 12 prepaid recharge plans with OTT benefit
Reliance Jio : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) పోర్ట్‌ఫోలియో నుంచి కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను పూర్తిగా తొలగించినట్లు కనిపిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ HotStar) సబ్‌స్క్రిప్షన్‌తో జియో రీఛార్జ్ ప్లాన్ (Jio Recharge Plans)లు చాలా వరకు టెలికాం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి అదృశ్యమయ్యాయి. ప్రస్తుతం, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్‌తో కేవలం రెండు ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
Jio నిలిపివేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితా :
– రూ. 151 డిస్నీ+ హాట్‌స్టార్ డేటా యాడ్-ఆన్ ప్యాక్
– రూ. 555 యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్
– రూ. 659 యాడ్-ఆన్ ప్లాన్
– జియో రూ. 333 డిస్నీ+ హాట్‌స్టార్ రీఛార్జ్ ప్లాన్
– జియో రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్
– జియో రూ.583 ప్లాన్
– జియో రూ 601 ప్లాన్
– జియో రూ.783 ప్లాన్
– జియో రూ.799 ప్లాన్
– జియో రూ 1066 ప్లాన్
– రూ. 2999 ప్లాన్
– రూ. 3119 ప్లాన్
Reliance Jio quietly discontinued over 12 prepaid recharge plans with OTT benefit
డిస్నీ+ హాట్‌స్టార్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికీ జియో వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్ అందిస్తుంది. రోజుకు 100 SMSలను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఇతర ప్లాన్ రూ. 4,199 రీఛార్జ్ ప్యాక్. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. రోజువారీగా 3GB రోజుకు అందిస్తుంది.
Reliance Jio quietly discontinued over 12 prepaid recharge plans with OTT benefit
యూజర్లు రోజుకు 100 SMSలను కూడా పొందుతున్నారు. ఈ ప్లాన్ ఏడాది (365 రోజులు) వ్యాలిడిటీ అందిస్తుంది. రెండు ప్లాన్‌లు ఒక ఏడాదిలో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అందించవచ్చు. ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎందుకు నిలిపివేసిందో ప్రస్తుతానికి తెలియదు. కానీ, ప్రీపెయిడ్ ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇతర ప్లాన్‌లకు మారవాల్సి రావొచ్చు. అతి త్వరలో కొన్ని కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..