Samsung Galaxy A05 Price : శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A05 Price : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ05 భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందుగానే కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి.

Samsung Galaxy A05 Price : శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A05 Price in India Revealed

Updated On : November 25, 2023 / 11:34 PM IST

Samsung Galaxy A05 Price : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఇటీవలే గెలాక్సీ ఎ04కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఎంపిక చేసిన దేశాలలో లాంచ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో ఆవిష్కరించిన గెలాక్సీ ఎ05ఎస్ మోడల్‌లో చేరింది.

గెలాక్సీ ఎ05 మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీతో వస్తుంది. 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉండనుంది. ఇటీవల, హ్యాండ్‌సెట్ యూజర్ మాన్యువల్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు భారత్‌లో గెలాక్సీ ఎ05 ధర వెల్లడైంది. మూడు కలర్ ఆప్షన్లలో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందించనుంది.

Read Also : TRAI DND app : స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌తో బ్లాక్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ05 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎ05 బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 4జీబీ + 64జీబీ వేరియంట్ క్రోమా వెబ్‌సైట్‌లో రూ. 12,499, అయితే 6జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ. 14,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ త్వరలో అధికారిక వెబ్‌సైట్, ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో లిస్టు అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy A05 Price in India Revealed

Samsung Galaxy A05 Price 

శాంసంగ్ గెలాక్సీ ఎ05 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎ05 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ ప్లస్ (1,600 x 720 పిక్సెల్‌లు) పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. మాలి జీ52 జీపీయూతో జత చేసిన మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. 6జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎమ్ఎమ్‌సీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్‌‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.1తో ఫోన్ రన్ అవుతుంది. కెమెరా విభాగంలో గెలాక్సీ ఎ05 డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు 2ఎంపీ డెప్త్ షూటర్ ఉన్నాయి. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫోన్ డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉండనుంది.

గెలాక్సీ ఎ05 25డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 4జీ, వై-ఫై 802.11, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ 2.0, జీపీఎస్, గ్లోనాస్ యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సైజు 168.8ఎమ్ఎమ్ x 78.2ఎమ్ఎమ్ x 8.8ఎమ్ఎమ్, బరువు 195 గ్రాములు ఉంటుంది.

Read Also : Realme GT 5 Pro Launch : రియల్‌మి జీటీ 5 ప్రో వచ్చేస్తోంది.. డిసెంబర్ 7నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!