Samsung Galaxy A36 : శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. లాంచ్ ఎప్పుడంటే?
Samsung Galaxy A36 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ మార్చి 2025లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ35కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.

Samsung Galaxy A36 Tipped to Arrive With Upgraded Front Camera
Samsung Galaxy A36 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఎ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎ35 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ఈ కొత్త గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీని శాంసంగ్ ధృవీకరించలేదు. ప్రారంభ లీక్‌లను పరిశీలిస్తే.. ఫ్రంట్ కెమెరా అప్‌గ్రేడ్‌తో వస్తుందని సూచిస్తున్నాయి. బ్యాక్ సైడ్ శాంసంగ్ గెలాక్సీ ఎ36 నుంచి 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ మార్చి 2025లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ36 సెల్ఫీ కెమెరా :
గెలాక్సీ క్లబ్ (డచ్) నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫ్రంట్ సైడ్ 12ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా సెన్సార్ గెలాక్సీ ఎ56 ఫోన్ 12ఎంపీ సెన్సార్ మాదిరిగా ఉండదు. శాంసంగ్ రాబోయే గెలాక్సీ ఎ36, శాంసంగ్ గెలాక్సీ ఎ56 మధ్య కెమెరా క్వాలిటీలో తేడా ఉంటుందని అంచనా.
ప్రస్తుత శాంసంగ్ గెలాక్సీ ఎ35 ఫోన్ మాదిరిగా శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుందని నివేదిక పేర్కొంది. గత మోడల్ మాదిరిగానే కెమెరా సెటప్‌లో 5ఎంపీ మాక్రో సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 ఎస్ఓసీ లేదా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కాన్ఫిగరేషన్‌లో 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్, పిల్-ఆకారపు మాడ్యూల్ లోపల 3 వర్టికల్ కెమెరాలతో రీడిజైన్ కెమెరా ఐలాండ్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వచ్చే ఏడాది మార్చిలో లాంచ్ కానుందని సమాచారం.162.6 x 77.9x 7.4ఎమ్ఎమ్‌తో వస్తుందని అంచనా.